Mahesh Babu : జీ తెలుగు డాన్స్ షో లో కనిపించినందుకు మహేష్, సితార అందుకు పారితోషికం ఎంతో తెలుసా?

Authored By aruna | The Telugu News | Published on: August 30, 2022, 1:40 pm

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న స్టార్ డం అంతా ఇంతా కాదు ఆయన ఒక్క యాడ్లో కనిపిస్తే కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇచ్చేందుకు పదుల సంఖ్యలో కంపెనీలు క్యూలో ఉన్నాయి. అలాంటి మహేష్ బాబు ఒక కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైతే ఆ షో యొక్క రేటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే మహేష్ బాబు తమ షో కి రావాలంటే చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఆయన మాత్రం ఫ్రీ గా అలాంటి కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించరని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిర్వహిస్తున్న ఒక డాన్స్ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొన్న విషయం తెలిసిందే.

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న మహేష్ బాబు తనతో పాటు కూతురు సితారను కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. సితార మరియు మహేష్ బాబు రాకతో ఆ కార్యక్రమం స్థాయి ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయింది. తండ్రి కూతురు కలిసి కార్యక్రమానికి రావడంతో జీ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆ కార్యక్రమాన్ని చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక జీ తెలుగు యాజమాన్యం కూడా ఆ షో ను చాలా ప్రత్యేకంగా ప్రసారం చేయాలని భావిస్తున్నారు. అంతా బానే ఉంది కానీ బుల్లి తెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆ కార్యక్రమంలో మహేష్ బాబు మరియు సితార పాల్గొన్నందుకు గాను కవర్ తీసుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Mahesh Babu and Ghattamaneni Sithara take remuneration for zee telugu dace show

Mahesh Babu and Ghattamaneni Sithara take remuneration for zee telugu dace show

మహేష్ అభిమానులు మాత్రం ఇలాంటి చిన్న కార్యక్రమాలకు మహేష్ బాబు హాజరవ్వడమే చాలా అరుదుగా కనిపిస్తుంది, అలాంటిది ఒక చిన్న కార్యక్రమానికి డబ్బులు తీసుకొని హాజరవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. మహేష్ బాబు ఒక్కో సినిమాకు పదుల కోట్ల పారితోషకాన్ని తీసుకుంటూ ఉంటాడు. అలాంటిది చిన్న కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చేందుకు కూడా పారితోషికం డిమాండ్ చేసే తక్కువ స్థాయి ఆయనది కాదు అని కొంత మంది అంటూ ఉంటే, మరి కొందరు మాత్రం తమ వల్ల లాభపడ్డ వారి దగ్గర నుండి పారితోషికం తీసుకోవడంలో తప్పేం లేదు. కనుక మహేష్ బాబు జీ తెలుగు వద్ద కొంత మొత్తాన్ని తీసుకుంటే తప్పేం లేదు అంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. అసలు విషయం ఏంటి అనేది జీ తెలుగు వారు స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

aruna

No bio available for this author.

  1. "Samvidhan Raksha March : ప్రతి డివిజన్ నుంచి 100 మంది రావాలి.. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పిలుపు!"

  2. "Janasena Party : కూటమిలో ఉంటూనే జనసేన సొంత బలం పెంచుకుంటోందా?.. ప‌వ‌న్‌ది ఏం ప్లాన్ గురూ..!"

  3. "WhatsApp Web : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. ఈ చిన్న తప్పుతో మీ అకౌంట్ ప్రమాదంలో పడొచ్చు!"

  4. "Trisha Politics : మరో జయలలితగా త్రిష?.. విజయ్‌తో రాజకీయాల్లోకి వస్తారా? అభిమానుల కొత్త ప్లాన్!"

  5. "Farmers Income : పంటల కంటే కూలీ పనులతోనే ఎక్కువ ఆదాయం.. రైతులపై NSO సర్వేలో సంచలన విషయాలు!"

  6. "Indiramma Bima : రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా కోసం ఈ పత్రాలు చాలు.. డిసెంబర్ 18 వరకే చాన్స్‌..!"

  7. "Gold Rate Today : 24 నవంబర్ 2026 మళ్లీ షాకిస్తున్న బంగారం.. వరుసగా రెండో రోజూ పెరిగిన పసిడి ధరలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp