Nikhil Siddharth : నిఖిల్ తమ్ముడు మరీ అంత పెంచితే కష్టం.. కాస్త నేల మీద కి రావాలి కదా
Nikhil Siddharth : యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి దశాబ్ద కాలం అయ్యింది. ఇన్ని సంవత్సరాల్లో ఈయన సాదించిన విజయాలు.. సొంతం చేసుకున్న కలెక్షన్స్ గురించి ఎప్పుడు ప్రత్యేకంగా చర్చ జరగలేదు. కానీ మొదటి సారి నిఖిల్ కార్తికేయ 2 సినిమా తో వంద కోట్ల వరకు వసూళ్లను దక్కించుకోవడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఆయన సినిమాల గురించే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆయన నటించబోతున్న సినిమాలకు కూడా బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి రెండు సినిమాల వరకు హిందీలో నిఖిల్ హడావుడి ఉంటుందట.
ఈ సమయంలో నిఖిల్ తో సినిమాను చేసేందుకు సంప్రదిస్తున్న నిర్మాతలకు చాలా పెద్ద అమౌంట్ చెప్పి షాక్ ఇస్తున్నాడట. బాబోయ్ మరీ అంత అమౌంట్ ఏంటి భయ్యా అంటూ కొందరు ఆయన ముందే అంటూ ఉంటే మరి కొందరు మాత్రం పక్కన వారితో నిఖిల్ మరీ ఓవర్ గా డిమాండ్ చేస్తున్నాడు అంటున్నారు. కార్తికేయ 2 సినిమా కు దాదాపుగా అయిదు కోట్ల వరకు పారితోషికంగా నిఖిల్ తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఏకంగా పది నుండి పన్నెండు కోట్ల వరకు కథ అనుసారంగా డిమాండ్ చేస్తున్నాడట.
ఒక్కసారిగా ఆ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు అంటున్నారు. కార్తికేయ 2 సూపర్ హిట్ అయినా కూడా నిఖిల్ మార్కెట్ పాతిక కోట్లకు మించి ఉండదు. కనుక ఆయనతో సినిమాను 15 నుండి 20 కోట్ల బడ్జెట్ తోనే నిర్మించాలి. అలా నిర్మిస్తేనే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. అలా కాదని ఆయన పారితోషికం పది ఇచ్చి మరో పది పదిహేను మేకింగ్ కు ఖర్చు చేస్తే నిర్మాతలు రిస్క్ లో పడ్డ వారు అవుతారు. సినిమా సూపర్ హిట్ అయితే తప్ప ఆ మొత్తంను రాబట్టడం కష్టం. అందుకే నిఖిల్ ఆరు ఏడు కోట్ల వరకు అయితే పర్వాలేదు అన్నట్లుగా కొందరు నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.