Hero Fans : హీరోల ఫ్యాన్స్ ను ఈ విధంగా కూడా దోపిడి చేస్తున్న నిర్మాతలు
Hero Fans : టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు తమ జేబు లోంచి వేలకు వేలు ఖర్చు పెట్టి తమ యొక్క అభిమానాన్ని నిరూపించుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరో కొత్త సినిమా వస్తుంది అంటే వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టి ఫ్లెక్సీలు వేయించి కటౌట్లు పెట్టి మొదటి రోజు మొదటి ఆట చూసేందుకు బ్లాక్ లో టికెట్లు కొనుగోలు చేసి.. థియేటర్లో రచ్చ చేసేందుకు మళ్లీ వేలకు వేలు ఖర్చు చేసి నానా హంగామా చేస్తూ ఉంటారు. ఇంత చేస్తే హీరోలు తమ అభిమానులకు కనీసం ఫోటోలు దిగేందుకు ఒక ఫోజు కూడా ఇవ్వరు. కనీసం ఒకసారి కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు. అయినా కూడా తమ అభిమాన హీరో అంటూ దేవుడు అంటూ పెద్ద ఎత్తున పూజలు చేస్తూ కొత్త సినిమా వస్తే సందడి చేస్తూ ఉంటారు.
కొత్త సినిమాలు వచ్చిన సమయంలో సందడి చేయడం కామన్ విషయం, కానీ ఇప్పుడు తమ అభిమాన హీరోల పుట్టిన రోజు వేడుకలకు పాత సినిమాలను విడుదల చేయించి వాటిని వేల రూపాయలు టికెట్లు పెట్టి కొనుగోలు చేసి ఆ సినిమాలను చూస్తూ తమ అభిమాన హీరో యొక్క బర్త్డే వేడుకలను నిర్వహిస్తున్నారు. హీరో అభిమానులు సరదా పడుతున్నారు కదా అని సదరు సినిమాల యొక్క నిర్మాతలు ఫ్రీ గా సినిమా ను స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నిర్మాతలు అభిమానులను దోపిడీ చేసేందుకోసమని కచ్చితంగా భారీ ఎత్తున టికెట్ రేట్లను పెడుతున్నారు. రీ రిలీజ్ లో తమకు బారి లాభం రావాలనే ఉద్దేశంతో ఎక్కువ స్క్రీన్స్ లలో విడుదల చేయడం తో పాటు అభిమానులు ఎక్కువ రేటు పెట్టి మరి టికెట్టు కొనుగోలు చేసేలాగా ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల మహేష్ బాబు నటించిన పోకిరి మరియు ఒక్కడు సినిమాలు భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మరియు తమ్ముడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఒక్క సినిమాను కొన్ని థియేటర్లో రిలీజ్ చేస్తే పరవాలేదు, కానీ రెండు మూడు సినిమాలను వందల కొద్ది థియేటర్లలో రిలీజ్ చేస్తూ అభిమానులను కొత్త రకంగా దోచుకుంటున్నారంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు తక్కువ మొత్తానికి సినిమాను అభిమానులకు అందిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే.. అభిమానంతో కళ్ళు మూసుకు పోయిన అభిమానులకు అలానే చేయాలంటూ మరి కొందరు కౌంటర్ వేస్తున్నారు. మొత్తానికి పాత సినిమాలతో భారీ మొత్తాన్ని లాభంగా పొందుతున్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు.