Athadu Movie : మహేశ్ బాబు ‘అతడు’ సినిమాలో డిలీట్ చేసిన 6 సీన్స్.. ఇప్పుడు చూస్తే వావ్ అనాల్సిందే?
Athadu Movie : అతడు సినిమా గురించి తెలుసు కదా. అప్పట్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అతడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. సినిమా ఆధ్యంతం నవ్వులు పూయించడమే కాకుండా.. ఒక స్ట్రాంగ్ పాయింట్ తో ముందుకు వెళ్తుంది. సినిమాలోని పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు పాత్రలే కీలకం. ఒకటి హీరో మహేశ్ బాబు, రెండు విలన్ సోనూసూద్. ఇద్దరి క్యారెక్టర్లను త్రివిక్రమ్ బాగా తీర్చిదిద్దాడు.

mahesh babu athadu movie deleted scenes
నిజానికి ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేయాల్సింది కానీ… మహేశ్ బాబు వద్దకు సినిమా కథ వచ్చింది. పవన్ కు సినిమా కథ నచ్చకపోవడంతో త్రివిక్రమ్… అతడు కథను మహేశ్ బాబుకు చెప్పడం.. మహేశ్ బాబు కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేయడంతో అతడు సినిమా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లింది.
ఈసినిమా రిలీజ్ అయి 16 ఏళ్లు అయినా ఇంకా ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తెలుగు ప్రేక్షకులు ఇంకా గుర్తు పెట్టుకున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం, హేమ మధ్య వచ్చే కామెడీ సీన్లకయితే నవ్వలేక చావాల్సిందే.
ఏ సినిమాలో అయినా సరే… షూటింగ్ తీసినంతా యాడ్ చేయరు. ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని సీన్లను కట్ చేస్తుంటారు. షూటింగ్ జరిగినా కూడా కొన్ని సీన్లను తీసేస్తుంటారు. సినిమా నిడివిని తగ్గించడం కోసమో లేదా… ఆ సీన్లు అవసరం లేదనుకుంటే.. అలా చేస్తుంటారు.
అలా అతడు సినిమాలో చాలా సీన్లను డిలీట్ చేశారట. ప్రస్తుతం అతడు సినిమాలో డిలీట్ చేసిన సీన్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవే ఫోటోలను ప్రిన్స్ మహేశ్ డాట్ కాం అనే వెబ్ సైట్ వాళ్లు విడుదల చేశారు.
ఇంతకీ అతడు సినిమాలో డిలీట్ చేసిన సీన్స్ ఏంటి… దానికి సంబంధించిన ఫోటోలు ఏంటో తెలుసుకుందాం రండి.
మొదటి ఫోటో
ఈ ఫోటో బాసర్లపూడిలో షూటింగ్ సమయంలో తీసిన ఫోటో. ఈ ఫోటోలో మహేశ్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ ను కూడా చూడొచ్చు. తనెవరో… తను ఎక్కడి నుంచి వచ్చాడో… సునీల్ కు చెప్పే సీన్ అది. దీంట్లో కూడా కొన్ని సీన్లను కట్ చేశారట.

mahesh babu athadu movie deleted scenes
రెండో ఫోటో
ఈ ఫోటోలో త్రిష గెటప్ చూస్తేనే డిఫరెంట్ గా ఉంది కదా. సినిమాలో ఈ గెటప్ తో త్రిష ఎక్కడా కనిపించలేదు. బహుశా… ఈ సీన్ అవసరం లేదని తీసేసుంటారు.

mahesh babu athadu movie deleted scenes
మూడో ఫోటో
ఈ ఫోటోలో ఉన్న సీన్ ను కూడా మూవీ యూనిట్ డిలీట్ చేసింది. మహేశ్, త్రిష మధ్య ఏదో రొమాన్స్ సీన్ ఉన్నట్టుంది. కానీ.. ఈ సీన్ ను కూడా డిలీట్ చేసేశారు.

mahesh babu athadu movie deleted scenes
నాలుగో ఫోటో
ఈ ఫోటోలో చూశారు కదా. త్రిష నెత్తి మీద ఏదో కలర్ డబ్బా పడింది. అసలు.. సినిమాలో ఇటువంటి సీనే లేదు. అంటే ఈ సీన్ ను కూడా కట్ చేశారన్నమాట.

mahesh babu athadu movie deleted scenes
ఐదో ఫోటో
ఈ షోటోలో త్రిష, మహేశ్ బాబు… ఇద్దరూ వైన్ తాగుతూ కనిపించారు. అయితే… సినిమాలో ఇటువంటి సీనే లేదు. ఇద్దరూ కలిసి ఇలా మందు తాగే సీనే లేదు.

mahesh babu athadu movie deleted scenes
ఆరో ఫోటో
ఈ ఫోటోలో ఉన్న సీన్ లాంటిది సినిమాలో ఉంటుంది. మార్కెట్ లో మహేశ్ బాబు, సోనూసూద్… ఇద్దరూ కలిసి… ఓ వ్యక్తిని కత్తితో పొడిచి పారిపోతుంటారు. దానికి సంబంధించిన ఫోటోనే ఇది. కానీ… ఈ సీన్లకు సంబంధించి కొన్ని సీన్లను కూడా ఎడిటింగ్ లో తీసేశారట. దానికి సంబంధించిన ఫోటోనే ఇది.

mahesh babu athadu movie deleted scenes
(Pics Courtesy by princemahesh.com)