Guntur kaaram Movie : గుంటూరు కారం సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guntur kaaram Movie : గుంటూరు కారం సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు..!

 Authored By aruna | The Telugu News | Updated on :17 January 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Guntur kaaram Movie : గుంటూరు కారం సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు..!

Guntur kaaram Movie  : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ గుంటూరు కారం ‘ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే మంచి వసూళ్లు రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించారు. మీనాక్షి చౌదరి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ కి సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు.యాంకర్ సుమ మహేష్ బాబు, శ్రీలీల వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు డాన్స్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుమా మాట్లాడుతూ డాన్స్ గురించి ఈ సినిమాలో విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో డాన్స్ చించి ఇరగదీసేశారు. అసలు చాలా బాగా చేశారు అని సుమ ప్రశంసించారు. దానికి మహేష్ బాబు మాట్లాడుతూ ముందు నుంచి నేను త్రివిక్రమ్ ఒకటి అనుకున్నాం. రెండు పాటలకు డాన్స్ మాత్రం ఒక రేంజ్ లో చేయాలి అనేది ముందు నుంచి ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే దీని తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు చేస్తామో తెలియదు. అది నేను చేసే చివరి తెలుగు సినిమా అవ్వచ్చు అని అంటూనే మళ్ళీ జాగ్రత్తపడి డాన్సుల విషయంలో చేయగలిగిన చివరి తెలుగు సినిమా ఇదే అవ్వచ్చు అని ఆయన కవర్ చేసారు.

దానికి సుమ మళ్లీ మీరు మూడేళ్ల తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అనిపిస్తుంది. అంటే దానికి మహేష్ అలా ఏమి కాదు రెగ్యులర్గా ఇలాంటి తెలుగు సినిమాలు మళ్లీ మళ్లీ వస్తాయో రావు తెలియదు. వచ్చినప్పుడు బాగా చేస్తే అభిమానులు కూడా ఆనందిస్తారు కదా అంటూ ఆ విషయాన్ని అంతటితో ఆపేసాడు. ఇక మహేష్ బాబు నెక్స్ట్ సినిమా రాజమౌళితో చేయబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ అడ్వెంచర్ సినిమా ను చేయబోతున్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే మినిమం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుంటూరు కారం లాంటి తెలుగు సినిమా రాదని అనుంటారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది