mahesh babu comments on puri jagannath
Mahesh Babu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించింది పోకిరి సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లతో పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన బిజినెస్ మేన్ కూడా అదే స్థాయిలో ఆడింది. అనంతరం వీరిద్దరూ తమ కాంబినేషన్ లో మూడో సినిమాగా జనగణమన అనే చిత్రాన్ని ప్రకటించారు. పలు కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. మహేష్ కారణంగానే మూవీ క్యాన్సిల్ అయిందని పూరీ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. తన వల్ల హిట్స్ సొంతం చేసుకున్న ఓ స్టార్ హీరో ఇప్పుడు తనను లెక్క చేయడం లేదని పరోక్షంగా పలుమార్లు వాపోయారు. దీంతో పూరీకి మహేష్ కు మధ్య విబేధాలు వచ్చాయని అంతా అనుకున్నారు.
కానీ ఇటీవల మహేష్ పూరీ పట్ల చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం వారి అంచనాలను తారుమారు చేస్తూ అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి.తాజాగా మహేష్ తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ షో జరిగిన ఓ సంఘటన ఆసక్తి కలిగించేలా ఉంది. గేమ్ లో ఓ సెగ్మెంట్ లో భాగంగా.. ఫ్రెండ్ తో ఫోన్ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు మహేష్ జాబితాలో మొత్తం తనతో పనిచేసిన ఆయన దర్శకులనే ఎంచుకున్నారు. అందులో కొరటాల శివతో పాటు పూరీ జగన్నాధ్, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు వంశీ పైడిపల్లి… ఈ అయిదుగురి పేర్లు స్క్రీన్ పై తారసపడటం గమనార్హం. ఈ అయిదుగురు పేర్లలో పూరీ జగన్నాధ్ పేరు అంచనాలకు అందనిదిగా ఉంది.
mahesh babu comments on puri jagannath
అంతేకాదు ఈ షోలో ‘సర్కార్ వారి పాట’ సినిమాపై స్పందించిన మహేష్… ఈ చిత్రం పూరీ గారి స్టైల్ లో ఉంటుందంటూ ఇందులో ‘ పోకిరి’ మూవీ వైబ్స్ ఉంటాయని ప్రస్తావించడం ఒకింత ఆశ్చర్యం కలిగించేలా ఉంది. అందుకు గత కొంత కాలంగా మహేష్ పూరీల మధ్య కొనసాగుతూ వస్తున్న వివాదాలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు నాడు కూడా మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలపడం అప్పట్లో వైరల్ గా మారింది. ఏదీ ఏమైనప్పటికీ ఇక్కడితో విభేదాలు తొలగి పోయి వారిద్దరి కాంబినేషన్ లో జనగణమన తెరకెక్కి.. ‘హ్యాట్రిక్’ మూవీగా నిలవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.