Viral Video : వర్క్ ఫ్రమ్ హోం లో ఉన్న ఉద్యోగులకు ఓ కంపెనీ సీఈఓ భారీ షాక్ ఇచ్చాడు. సాధారణంగా రోజులాగే జూమ్ లో మీటింగ్ ను ఆరెంజ్ చేశాడా అధికారి. అయితే అది మీటింగ్ కోసం కాదని తమను తీసేసెందుకు ఏర్పాటు చేసిన మీటింగ్ అని తెలిసే సరికి ఆ ఉద్యోగులంతా ఖంగు తిన్నారు. ఇంతకు ఆ సీ ఈ వో తొలగించింది ఎంత మందినో తెలుసా.. పది, ఇరవై కాదండీ. ఏకంగా 900 మంది ఉద్యోగులను ఒకేసారి తన కంపెనీ నుంచి తీసేశాడు. అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి.
అమెరికాకు చెందిన ఓ ప్రముఖ గృహ రుణాలు, తనఖా సంస్థ బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గే నే మనం ఇంతసేపు మాట్లాడుకున్న వ్యక్తి. ఉద్యోగులు తమ రోజువారీ పనిలో చూపించే.. సమర్థత, పనితీరు నచ్చక పోవడం తదితర కారణాలతోనే వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు విశాల్ వెల్లడించారు. రోజుకు 8 గంటలు పని చేయాల్సిన ఉద్యోగులు… కనీసం 2 గంటలు కూడా పనిచేయడం లేదంటూ వారిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ అనంతరం ఎవరెవరిని తీసేశామో వారికి మెయిల్ వస్తుందని అనడంతో ఒక్కసారి ఉద్యోగుల గుండెల్లో బాంబులు పేలినంత పనైంది.
గత బుధవారం జరిగిన ఈ విషయానికి సంబంధించిన వీడియోను ఓ ఉద్యోగి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తన కెరీర్‌లో రెండోసారి అని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగక… గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు తాను ఎంతగానో బాధపడుతూ ఏడ్చినట్లు చెప్పడం కొస మెరుపు. ఇదిలా ఉండగా ఆ తొలగింపబడిన ఉద్యోగులతో పాటు అనేక మంది విశాల్ పై విరుచుకు పడుతున్నారు. ముందే తెలియజేయకుండా ఓ జూమ్ మీటింగ్ లో వందల మందిని ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.