
Guntur Karam Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులపై ఎమోషనల్ మాటలు...!
Guntur Karam Movie : పాన్ ఇండియా స్టార్ అంటే ఫ్యాన్స్ లో ఏమాత్రం క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మహేష్ బాబు సినిమా వచ్చిందంటే థియేటర్లో అభిమానులు కోలాహలం నెలకొంటుంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుంచి ఓ గ్లిమ్స్, మూడు పాటలు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో గుంటూరు కారం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నిన్న సాయంత్రం గుంటూరులో జరిగిన గుంటూరు కారం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఎమోషనల్ మాటలతో అభిమానులకు ఎంతో దగ్గర అయ్యాడు.
నాకు మీరే “అమ్మా నాన్న ఇక అన్ని మీరే ‘అని ఎమోషనల్ గా అభిమానులను చూస్తూ అనడంతో అభిమానులలో ఓ చిన్నపాటి అలజడి మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ లు ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు.. అభిమానులలో అమ్మానాన్నలు చూసుకుంటాను అని చెప్పడంతో ఈ గుంటూరు కారం ఈవెంట్లో హాజరైన అభిమానులు నే కాకుండా సోషల్ మీడియా ఫ్యాన్స్ అభిమానులు కూడా బాధ వ్యక్తం చేశారు.ఇటీవలలో నిర్మాత వంశీ అనవసరంగా ఫ్యాన్స్ పై గొడవ క్రియేట్ చేసిన సందర్భాన్ని కూడా మహేష్ బాబు మాటలతో అందరూ మరిచిపోతారు అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ వారి అభిమానాన్ని వ్యక్తం చేశారు.’గుంటూరు కారం’ మహేష్ అభిమానులకు చాలా మంచి మూవీ. ఎందుకనగా రాజమౌళి సినిమా రిలీజ్ అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది.
ఆనాటి వరకు వాళ్లకి గుంటూరు కారమే అన్ని.. బాహుబలి కి ముందు ప్రభాస్ కి మిర్చి లాగా ఇప్పుడు మహేష్ బాబు కి గుంటూరు కారం కాబోతోంది.
ఒకే సంవత్సరంలో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి తండ్రి కృష్ణ అన్నయ్య రమేష్ బాబు తనకు దూరమయ్యారు.. అందుకే తను ఎమోషనల్ గా అభిమానులతో మీరు నా గుండెల్లో ఉంటారు. మీరే నాకు అన్ని అంటూ.. ఎప్పుడు చేసేది మీకు చెయ్యెత్తి దండం పెట్టడం కంటే ఇంక నేనేమీ చేయలేను అంటూ చాలా ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇన్నాళ్లపాటు తనలో దాగివున్న ఎమోషనల్ నిన్న ఈవెంట్ లో ఒక్కసారిగా బయటపెట్టాడు. సూపర్ స్టార్ మహేష్ తన మాటల్లో నిజాయితీ కనిపించడమే కాదు. చివర్లో అభిమానులకి ఇలా చెయ్యెత్తి దండం పెట్టడం కూడా అభిమానులకి బాగా దగ్గరయ్యాడు మహేష్ బాబు.
ఇక జనవరి 12న విడుదలయ్యే గుంటూరు కారం ఏ విధంగా ఉండబోతుందో అభిమానులకి చెప్పక్కర్లేదు అన్నట్లుగా అభిమానులు ఫీల్ అవుతున్నారు..
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.