Home » Entertainment » Mahesh Babu Emotional Post About His Mother Indira Devi
Entertainment

Mahesh Babu : తల్లి మరణం గురించి మహేశ్ అన్న ఆ మాటలకి మీరు ఏడవడం గ్యారెంటీ .. !

Authored By
Sam C
The Telugu News | Published on: September 29, 2022, 7:00 pm
Advertisement

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (70) బుధ‌వారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతితో ఘ‌ట్ట‌మనేని అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి చెందారు. ఇండస్ట్రీ పెద్దలతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్, నటుడు వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్, అశ్వని దత్ వంటి ప్రముఖులు నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.అయితే త్ల‌లి మ‌ర‌ణం త‌ర్వాత మ‌హేష్ చాలా కుంగిపోయారు .ఏదో బాధ‌లో ఉన్న‌ట్టు గా క‌నిపిస్తుంది. ఇందిరా దేవి మరణం తర్వాత మహేష్ ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఇందిరా దేవి అంత్యక్రియలు అనంతరం మహేష్ ఈ పోస్ట్ చేశారు.
ఫుల్ ఎమోష‌న‌ల్‌..

Advertisement

ఇందిరా దేవి పాత ఫోటో పోస్ట్ చేసిన మహేష్… లవ్ ఎమోజీలు కామెంట్స్ గా పోస్ట్ చేశారు. మాటల్లో వర్ణించలేని తన ప్రేమ, ఎఫెక్ష‌న్‌తో పాటు తాను దూర‌మైన బాధ‌ను తెలియ‌జేశారు. ఈ పోస్ట్‌కి అభిమానులు స్పందించారు. మహేష్ బాబుకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. కొన్నాళ్లుగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 28న ఇందిరా దేవి ఆరోగ్యం మరింత క్షీణించి తెల్లవారుజామున కన్నుమూశారు . నిన్న సాయంత్రం మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగాయి. చిన్న కొడుకు మహేష్ ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Mahesh Babu Emotional Post about His Mother Indira Devi

Advertisement

కృష్ణ, మహేశ్‌ బాబులను నేడు మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. గురువారం ఉదయం ఇంటికి వెళ్లి మహేశ్‌, కృష్ణలతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరా దేవి మరణం పట్ల చిరు విచారం వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు చిరంజీవి సంతాపం తెలిపారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నేపథ్యంలో మెగాస్టార్ అనంతపురంలో ఉన్నందున బుధవారం ఇందిరా దేవి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి