Prabhas : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల కన్నుమూశారు, ఆయన సంతాప సభ కి మొగల్తూరు వేదిక అయింది. కృష్ణంరాజు సొంత ఊరు అయిన మొగల్తూరులో భారీ ఎత్తున సంతాప సభ నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ప్రభాస్ సన్నిహితులు వారం పది రోజుల ముందు నుండే అక్కడ ఏర్పాట్లను ప్రారంభించారు. లక్ష మందికి పైగా హాజరయ్యేలా ప్రచారం చేశారు. అంతేకాకుండా అక్కడ లక్ష 20 వేల మందికి సరిపోయే ఆహార పదార్థాలను వండించాలని ముందస్తుగా ప్లాన్ చేశారు. అందుకోసం బడ్జెట్ మూడు కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ మూడు కోట్ల రూపాయలను కూడా ప్రభాస్ తన ఖాతా నుండి ఇచ్చాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మొగల్తూరులో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
కృష్ణంరాజు కుటుంబం ఏమీ ఆస్తి విషయంలో తక్కువ కాదు.. వందల కోట్ల ఆస్తి కృష్ణంరాజు ఫ్యామిలీ సొంతం, అయినా కూడా పెదనాన్న పై ఉన్న అభిమానంతో ప్రభాస్ మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరి పెదనాన్న సంతాప సభను నిర్వహించారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజం ఉందంటూ మొగల్తూరులో చాలా మంది అనుకుంటున్నారు. స్వయంగా ప్రభాస్ మూడు నాలుగు రోజుల నుండి స్థానికంగా జరుగుతున్న పనులను గురించి పర్యవేక్షిస్తున్నారని సంతాప సభ ఏర్పాట్లు చేసిన వారు కొందరు అంటున్నారు. కనుక కచ్చితంగా పెదనాన్న జ్ఞాపకార్థం తన అభిమానుల కోసం, పెదనాన్న అభిమానుల కోసం మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రభాస్ ఈ సంతాప సభ నిర్వహించారు.
ఈ సంతాప సభలో పెట్టిన భోజనం మెనూ గురించి రాబోయే ఐదు పది సంవత్సరాల వరకు కూడా అభిమానులు మరిచిపోయే పరిస్థితి లేదట. ఇంతకు భోజనంలో ఏం వడ్డించారో తెలిస్తే మీరు షాక్ అవ్వాలసిందే. భోజనంలో ఉన్న ఐటమ్స్ వివరాల్లోకి వెళితే.. 6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు. 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలు ఉన్నాయి. జాబితా చూస్తుంటే కాస్త ఖర్చైనా మొగల్తూరు వెళ్లి రెబల్ స్టార్ ఇంట భోజనం చేస్తే బాగుండేది అనిపిస్తుంది కదా…!
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.