Mahesh Babu : మ‌హేష్ బాబు చిలిపి ప‌నులు.. సూప‌ర్ స్టార్ చేసే పనుల‌కు నెటిజ‌న్స్ ఫిదా

Authored By Sam C | The Telugu News | Published on: February 24, 2022, 6:00 pm

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు ఇండ‌స్ట్రీకి సంబంధించిన‌ స్టార్ హీరోల‌లో మ‌హేష్ బాబు ఒక‌రు. ఈయ‌న ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో క‌ళావ‌తి సాంగ్ ఇప్ప‌టికే రిలీజ్ అయ్యి సినీ ప్రేమికుల మ‌న‌స్సుల‌ను దోచేసింది. ఈ సినిమా స‌మ్మ‌ర్ కానుక‌గా మే 12న రిలీజ్ అవుతోంది. సర్కారు వారి పాట సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో మ‌హేష్‌బాబు సినిమా ఉంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకుంది.

పూజా హెగ్డే మ‌హేష్‌తో రెండోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన మ‌హ‌ర్షి సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ జ‌రుగుతుండగా, ఈ సినిమా మే 12న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నుండగా, ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం షూటింగ్‌కి ఖాళీ దొర‌క‌డంతో మ‌హేష్ బాబు త‌న విలువైన స‌మ‌యాన్ని ఫ్యామిలీతో గ‌డుపుతున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మ‌హేష్ బాబు పిల్ల‌ల‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ వైర‌ల్‌గా మారింది.టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

mahesh babu enjoys with family

mahesh babu enjoys with family

Mahesh Babu : మ‌హేష్ ఫుల్ ఖుష్‌..

పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.ఇందులో మహేష్ బాబు సరసన కీర్తిసురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్,14 రిల్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ లిరికల్ కళావతి సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఈ సాంగ్ 35 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.అంతేకాకుండా ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.ఈ పాటకు మహేష్ బాబు వేసిన స్టెప్పులను ఇరగదీశాడు

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp