Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెల్సిందే. మహా నటి సినిమా తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆమె కనిపిస్తే చాలు అన్నట్లుగా అభిమానులు ఆహా ఓహో అన్నట్లుగా ఉన్నారు. ప్రతి స్టార్ హీరో కు జోడీగా ఆమె ను అభిమానులు ఊహించేసుకుంటున్నారు. కాని ఆమె మాత్రం కమర్షియల్ సినిమా ల కంటే కూడా అధికంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేసేందుకు ఆసక్తిగా ఉంటుంది. కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా లు బ్యాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెంగ్విన్ మొదలుకుని మొన్న విడుదల అయిన గుడ్ లక్ సఖి సినిమా వరకు ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి కాని కమర్షియల్ గా మాత్రం పెద్దగా స్పందన రావడం లేదు. దాంతో ప్రేక్షకులు ఆమె సినిమా లను లేడీ ఓరియంటెడ్ గా ఉంటే చూడరేమో అనే అభిప్రాయంకు ఇండస్ట్రీ వర్గాల వారు వచ్చేశారు. అందుకే ఇక మీదట వరుసగా కమర్షియల్ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో కీర్తి సురేష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సర్కారు వారి పాట సినిమా ను మహేష్ బాబుతో కలిసి ఈ అమ్మడు చేస్తున్న విషయం తెల్సిందే. సర్కారు వారి పాట సినిమా ఫలితం పై ఇన్నాళ్లు అనుమానం లేకుండా ఉన్న మహేష్ బాబు అభిమానులు ఇప్పుడు కీర్తి సురేష్ వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కీర్తి సురేష్ ఈమద్య కాలంలో రజినీకాంత్ తో నటించిన సినిమా మొదలుకుని ఏ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అవ్వలేదు. కనుక సర్కారు వారి పాట సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఒక్క హీరో కూడా కీర్తి సురేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనిపించేంత అందం మరియు ప్రతిభ ఆమె సొంతం. కాని ఆమె కు గత కొన్నాళ్లుగా లక్ కలిసి రావడం లేదు. అందుకే ఏం జరుగుతుందో అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా కనుక కమర్షియల్ గా హిట్ అయితే కీర్తి సురేష్ టాలీవుడ్ లో మళ్లీ మోస్ట్ వాంటెడ్ కమర్షియల్ హీరోయిన్ గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.