Home » Entertainment » Mahesh Babu Fans Tension About Trivikram Costing Selection
Entertainment

Mahesh Babu : గురూజీ నీకో దండం… మహేష్‌ సినిమాను ఆగం చేసి పడేయకు ప్లీజ్‌

Authored By
aruna
The Telugu News | Published on: August 30, 2022, 5:40 pm
Advertisement

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో మరియు అరవింద సమేత సినిమాల్లో పూజ హెగ్డే హీరోయిన్గా నటించినది. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ మహేష్ బాబు సినిమాలో ఆ హీరోయిన్ ని నటించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పూజ హెగ్డే కాకుండా మరెవరు కూడా మీకు దొరకలేదా అంటూ దర్శకుడు త్రివిక్రమ్ ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఇదే సమయంలో సినిమాలో ప్రయోగాత్మకంగా ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ ను ఈ సినిమాలో నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సినిమాను ఒక ప్రయోగశాలగా మార్చి మళ్లీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడేలా, మహేష్ బాబు అభిమానులను నిరాశపరిచేలా దర్శకుడు త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడా ఏంటి అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన తరుణ్ను ఇప్పుడు సినిమాల్లోకి తీసుకు రావాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో తరుణ్ నటించిన సినిమాలకు త్రివిక్రమ్ మాటలను అందించాడు. ఆ సన్నిహిత్యం మరియు సహవాసంతోనే మహేష్ బాబు సినిమాలో ఆయనను నటింపజేసే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

mahesh babu fans tension about trivikram costing selection

Advertisement

అంతేకాకుండా సినిమాలో సీనియర్ హీరోయిన్ గా మరో ప్రయోగాత్మక ఎంపిక త్రివిక్రమ్ దృష్టిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మహేష్ బాబు సినిమాను మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రయోగాల పేరుతో ఆగం చేస్తున్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాలు ఏ స్థాయి డిజాస్టర్లుగా నిలిచారు అందరికీ తెలిసిందే. ఆ సినిమాలు థియేటర్లలో నిరాశపర్చి టీవీల్లో సక్సెస్ అయ్యాయి, ఇప్పుడు ప్రయోగాల బాట పడితే థియేటర్లతో పాటు టీవీలో కూడా సక్సెస్ అవ్వదేమో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ నిర్ణయాలు కాస్త ఇబ్బందిగా ఉన్న ఆయన తప్పకుండా ఒక మంచి సినిమాను ఇస్తాడంటూ మరికొందరు అభిమానులు ఆశిస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి