Mahesh Babu : సినిమా టిక్కెట్ కోసం క్యూ లైన్‌లో మ‌హేష్ బాబు.. అమ్మాయిని భ‌లే క‌న్విన్స్ చేశాడుగా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : సినిమా టిక్కెట్ కోసం క్యూ లైన్‌లో మ‌హేష్ బాబు.. అమ్మాయిని భ‌లే క‌న్విన్స్ చేశాడుగా..

 Authored By sandeep | The Telugu News | Updated on :30 May 2022,3:00 pm

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు నిర్మాత‌గా, మ‌రోవైపు న‌టుడిగా రాణిస్తున్నాడు. ఆయ‌న నిర్మిస్తున్న తాజా చిత్రం మేజ‌ర్. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందుతుంది. ఈ చిత్రం జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్‌ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్‌ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజులో సెంటర్‌లో మేజర్‌ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా నిర్వహిస్తున్నారు.

Mahesh Babu : మ‌హేష్ హంగామా..

అయితే మేజ‌ర్ సినిమా టిక్కెట్స్ కోసం మ‌హేష్ బాబు క్యూలో నిలుచున్నాడు.ఇది మేజర్ సినిమా ప్రచారంలో భాగంగా అలా చేశారు. ఆ క్రమంలోనే ఓ థియేటర్ ముందు అప్పటికే క్యూ లైన్ లో నిల్చున్న నిహారిక ముందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఆమెకు చిరాకు తెప్పిస్తారు. అప్పుడే నటుడు అడివి శేష్ కూడా రావడంతో వారిద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంటుంది. అంతలోనే మహేశ్ బాబు వచ్చి లైన్ లో నిలబడతారు. అతన్ని చూడగానే నిహారిక ఆశ్చర్యపోయి.. మా స్నేహితుల్ని కూడా పిలవొచ్చా అని అడుగుతుంది.

mahesh babu fun video viral

mahesh babu fun video viral

దానికి మహేశ్ ఓకే అంటారు. దాంతో మళ్లీ లైన్ పెరుగుతుందు. మహేశ్ ని, నిహారిక ఫోన్ నెంబర్ అడిగేలోపు అక్కడ్నుంచి వెళ్లిపోవడం ఆమె అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ ముగ్గురి మధ్య జరిగే ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ ముగ్గురి మధ్య జరిగే ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది