
mahesh babu funny answers to netigens
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.ఈ చిత్రం మే 12న అభిమానుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు నెలకొంటున్నాయి. ఈ సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ అని ముందే ఫిక్స్ అయిపోయినట్టు కనిపిస్తోంది.ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా, పరశురాం దర్శకత్వం వహించాడు. తాజాగా మహేష్ బాబు ట్విట్టర్‌లో ఓ వీడియోను వదిలారు. అందులో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీ గురించి మీరు ఒక్క మాట, హ్యాష్ ట్యాగ్‌లో వివరించండి అని ఓ నెటిజన్ అడిగితే..
కామ్ అండ్ ఫోకస్ అని సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. మీ డీఎంలో వచ్చిన ఫన్నీయెస్ట్ మెసెజ్ ఏది అని ఇంకో నెటిజన్ అడిగాడు. అసలు నా డీఎం అనేది లాక్ చేసి ఉంచాను.. అది ఓపెన్ చేయాలా? అని మహేష్ చెప్పుకొచ్చారు.ఓ ఎమోజీలో మిమ్మల్ని మీరు వివరించండి అని మరో నెటిజన్ అడిగాడు. దీనికి స్మైలీ ఎమోజీ అని నవ్వుతూ చెప్పారు. మీరు ట్విట్టర్‌లో ఎవరినైనా ఒకరిని ఫాలో అవ్వాలనుకుంటే అది ఎవరిని? అని అడిగాడు ఇంకో నెటిజన్. నమ్రత ట్విట్టర్‌లో ఉంటే బాగుండేది.. ఆమెను ఫాలో అయ్యేవాడిని అంటూ చిలిపిగా సమాధానం చెప్పేశారు.ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ ఉండాలా అంటారా ? ఎస్ ఆర్ నో అన్న ప్రశ్నకు ఏ బిగ్ యస్ అంటూ మహేష్ రిప్లై ఇచ్చారు.ఒక్కడు సినిమాలోని ఏ కారెక్టర్‌ను ఫాలో అవుతారు.. మ్యూట్ చేస్తారు..
mahesh babu funny answers to netigens
బ్లాక్ చేస్తారు అని ప్రశ్నించారు ఓ నెటిజన్. స్వప్న పాత్రను ఫాలో అవుతాను.. ముకేష్ రిషి నా తండ్రి పాత్రను మ్యూట్ చేస్తాను.. ప్రకాష్ రాజ్ ఓబుల్ రెడ్డి పాత్రను బ్లాక్ చేస్తాను అని మహేష్ బాబు సమధానం ఇచ్చారు.ఇక సర్కారు వారి పాట కోసం చెప్పండి అంటూ అడగ్గా.. ‘నా అభిమానులు ఈ వేసవిలో బ్లాస్ట్ సినిమా చూస్తారా’ అంటూ చెప్పాడు.మరోవైపు సర్కారు వారి పాట సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. సర్కారు వారి పాట చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో బాబు బాక్సాఫీస్‌ను దడదడలాడించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.