
Mahesh Babu is ready to fight with Ravanasura
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో మంచి హిట్ అందుకోగా, ఈ మూవీ అందించిన ఉత్సాహంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ మూవీ చేస్తున్నాడు. .SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న విషయం విదితమే. అతడు, ఖలేజా వంటి రెండు సినిమాలు వీరి కాంబోలో రాగా, ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ సాధించడంతో మూడో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ప్రస్తుతం రెండవ షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుగుతుండగా, డిసెంబర్ 8 నుండి మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది.ఇక పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం నడుస్తుండగా, ఈ సినిమా నుండి మరో రూమర్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించ బోతున్నారు అనే విషయంపై ఇప్పటికే చాలా పేర్లు వినిపించగా, వారిలో సంజయ్ దత్, విక్కీ కౌశల్ వంటి వారు ఉన్నారు. ఇక ఇప్పుడు మరొకరి పేరు కూడా వినిపిస్తుంది మహేష్ బాబు కి విలన్ గా ఈ సినిమాలో ఆదిపురుష్ విలన్ సైఫ్ అలీ ఖాన్ ను తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తుంది.
Mahesh Babu is ready to fight with Ravanasura
చిత్రంలో విలన్ రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, విలన్ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ తీసుకోవాలని, ఆయన ఒప్పుకుంటే ఈయననే ఫిక్స్ చేయాలని చూస్తున్నారట.ఇదే నిజం అయితే బిటౌన్ లో కూడా ఈ సినిమా భారీ అంచనాలను అందుకోవడం ఖాయం.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. పలు రోజుల చిత్ర షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో చెప్పిన టైంకి మూవీని విడుదల చేస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.
Fruit Juice : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజువారీ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే కొందరు పండ్లు…
Sankranti Festival : సంక్రాంతి పండుగను సాధారణంగా పంటల పండుగగా మాత్రమే చూసినా, భక్తుల దృష్టిలో ఇది ఆధ్యాత్మికంగా ఎంతో…
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
This website uses cookies.