Mahesh Babu : మహేష్ బాబుకి మాతృ వియోగం.. సంతాపం తెలియజేస్తున్న ప్రముఖులు
Mahesh Babu : ఇటీవల ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో ఎందరో అకాల మరణం చెందారు. ఇక రీసెంట్‌గా కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసారు. ఇక నిన్న జబర్ధస్త్ నటుడు మూర్తి మృతి చెందారు. ఇక ఈ విషాదాల గురించి మరచిపోక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మహేష్ తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఆమెను వెంటిలేటర్ సపోర్ట్ పైనే ఉంచినట్లుగా తెలుస్తోంది.
అయితే వైద్యులు ఎంత కృషిచేసినా ఆమె ఆరోగ్యాన్ని కాపాడ లేకపోవడంతో ఆమె ఈ ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో కన్ను ముసినట్లుగా మహేష్ బాబు కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం అందించారు. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇందిరా దేవి మృతిపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. శ్రీమతి ఇందిరా దేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త తనను ఎంతో కలిచివేసిందన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చూకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేష్ బాబుకు , వాళ్ల కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
Mahesh Babu : మహేష్ తల్లి ఇక లేరు..
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఉదయం 9 గంటల నుంచి ఆమె పార్థీవ దేహాన్ని సూపర్ స్టార్ కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోస్ లో సందర్శకుల సందర్శనార్థం ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అయితే మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఈరోజు జరుగుతాయా లేక రేపటికి వాయిదా వేస్తారా అన్న విషయం మీద ప్రస్తుతానికైతే ఎలాంటి క్లారిటీ లేదు. . కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ సహా ఐదుగురు సంతానం. వీళ్లు కాకుండా మరో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నారు.