Sarkaru Vaari Paata : మహేష్ బాబు సినిమా కూడా కీర్తి సురేష్ కి కలిసి రాలేదా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sarkaru Vaari Paata : మహేష్ బాబు సినిమా కూడా కీర్తి సురేష్ కి కలిసి రాలేదా..?

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా మహానటి కీర్తి సురేష్ కి కలిసి రాలేదా..? అంటే ప్రస్తుతం అవుననే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. నిజంగానే అమ్మడి ఫేట్ బాలేదా ఏమో తెలీదు గానీ కీర్తి నటించిన ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతోంది. మహానటి సినిమా తర్వాత మళ్ళీ కీర్తి ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. అంతేకాదు, తనని కూడా ఐరెన్ లెగ్ అంటూ కామెంట్ చేశారని […]

 Authored By govind | The Telugu News | Updated on :13 May 2022,7:00 pm

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా మహానటి కీర్తి సురేష్ కి కలిసి రాలేదా..? అంటే ప్రస్తుతం అవుననే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. నిజంగానే అమ్మడి ఫేట్ బాలేదా ఏమో తెలీదు గానీ కీర్తి నటించిన ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతోంది. మహానటి సినిమా తర్వాత మళ్ళీ కీర్తి ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. అంతేకాదు, తనని కూడా ఐరెన్ లెగ్ అంటూ కామెంట్ చేశారని మొన్నా మధ్య స్వయంగా కీర్తి చెప్పుకొచ్చింది. అయితే, తాజాగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది.

కీర్తి సురేశ్ మాత్రమే కాదు..చిత్రబృందం అంతా ఈ మూవీ భారీ హిట్ సాధిస్తుందని ప్రమోషన్స్‌లో ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చారు. కానీ, ఈగురువారం(మే 12) ఇండియాతో పాటుగా అమెరికా వంటి దేశాలలో కూడా రిలీజైన సర్కారు వారి పాట చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. గతంలో వచ్చినకొన్ని ఫ్లాప్ సినిమాల కథలను సర్కారు వారి పాట చిత్రంతో పోల్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ చాలాకాలం తర్వాత కథలేని సినిమాలోనటించారని..సినిమా మొత్తం ఆయన భుజాల మీదే మోసారని ఫ్యాన్స్ చెప్పుకున్నారు.

Mahesh Babu movie also did not come with Kirti Suresh

Mahesh Babu movie also did not come with Kirti Suresh

Sarkaru Vaari Paata : అప్పటికి వరకు కీర్తి ఫేట్ గురించి ఏమీ డిసైడ్ చేయలేము.

దర్శకుడు ఎంచుకున్న మేయిన్ పాయింట్ మంచిదే అయినా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడని..హీరో, హీరోయిన్ పాత్రలుమాత్రమే కాకుండా మిగతా పాత్రలు అంత బలంగా లేవని డిసైడ్ చేశారు. ముఖ్యంగా కీర్తి సురేశ్ అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుందని..ఎదో కొన్ని చోట్ల
లుక్స్ పరంగా ఆకట్టుకున్న ఆమె పాత్రకు అసలు ఇంపార్టెన్స్ లేదని మాట్లాడుకుంటున్నారు. దాంతో కీర్తికి మహేశ్ బాబు సినిమాతో కూడా హిట్ దక్కనట్టేఅని ప్రచారం జరుగుతోంది. ఆమె ఏ హీరోతో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అని కూడా డిసైడ్ చేస్తున్నారు. మరి లాంగ్ రన్ లేదా కనీసం ఈ వారం ఆగితేనైనా
సర్కారు వారి పాట సరైన రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. అప్పటికి వరకు కీర్తి ఫేట్ గురించి ఏమీ డిసైడ్ చేయలేము.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది