Rashmika Mandanna out from pushpa 2
Rashmika Mandanna : ఇటీవల చాలా చిత్రాలు రెండు పార్ట్‌లుగా తెరకెక్కి ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. బాహుబలి నుండి ఈ పంథా మొదలైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ ఎంతటి సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇక బన్నీ కూడా ఊరమాస్ అవతారంలో తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. అయితే పుష్ప 2 కూడా వస్తుందని అందరికీ తెలిసిందే.
ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ను చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యింది. అయితే మరోసారి పుష్ప-2 సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.పుష్ప 2 కోసం సుకుమార్ సరికొత్త ప్లాన్స్ వేస్తున్నాడు. ఈ సారి సినిమా మరో రేంజ్‌లో ఉండాలని బాలీవుడ్ స్టార్స్‌ని కూడా పట్టుకొస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ ను కూడా పుష్ప సెకండ్ పార్ట్ లో ముఖ్యమైన పాత్రలో చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫస్ట్ పార్ట్ లో నటించిన హీరోయిన్ రష్మిక మందన నటనకు మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.
Rashmika Mandanna out from pushpa 2
అయితే రష్మికని తప్పించి వేరే హీరోయిన్‌ని పెట్టుకోనున్నారని వార్తలు వస్తుండగా, అది అసాధ్యం. అందుకు కారణం రష్మికతో చాలా సన్నివేశాలు చిత్రీకరించాడు సుకుమార్.పవర్ఫుల్ పాత్ర కోసం మాత్రమే దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోయిన్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్రను చివర్లో వచ్చే ఒక ట్విస్ట్ తో పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట. తప్పకుండా సినిమాలో ఆ క్యారెక్టర్ హైలెట్ అయ్యే విధంగా ఉంటుందట. అంతేకాకుండా మరికొంతమంది ప్రముఖ బాలీవుడ్ తారలను కూడా ఈ సినిమాలో భాగం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.