Home » Entertainment » Mahesh Babu Pokiri Movie Re Release In Grand Way
Entertainment

Mahesh Babu : మహేష్‌ బాబు నీకు ఇది తగునా.. అభిమానం పేరుతో కోట్లు దండుకుంటున్నావుగా!

Authored By
aruna
The Telugu News | Updated on: August 8, 2022 1:52 pm
Advertisement

Mahesh Babu : సూపర్ స్టార్‌ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి ఆ సినిమా అంటే మహేష్ బాబు అభిమానులు చెవులు కోసుకుంటారు. అలాంటి పోకిరి సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ హంగామా ప్రస్తుతం కొనసాగుతోంది. దాదాపుగా 250 స్క్రీన్స్ లో మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా రీ రిలీజ్ చేసేందుకు గాను ఏర్పాట్లు జరిగాయి. మరో యాబై థియేటర్లలో కూడా రేపటి వరకు షో పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

పోకిరి సినిమా మహేష్‌ బాబు సొంత బ్యానర్‌ అనే విషయం తెల్సిందే. ఇందిరా ప్రొడక్షన్స్ లో మహేష్‌ బాబు కుటుంబ సభ్యులు స్వయంగా నిర్మించారు. ఇప్పుడు సినిమా ను అభిమానుల కోసం.. వారి సంతోషం కోసం ఫ్రీ గా వేయవచ్చు. కాని వారు మాత్రం కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. రెగ్యులర్ టికెట్‌ ప్రైస్‌ కంటే కాస్త ఎక్కువ మొత్తానికి పోకిరి టికెట్ల రేట్లు ఉన్నాయి. అభిమానంతో తాము పోకిరి ని ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఉంటే వారు మాత్రం కమర్షియల్‌ గా ఆలోచించి బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటూ కొందరు మహేష్ బాబు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

mahesh babu pokiri movie re release in grand way

Advertisement

మహేష్ బాబు తల్చుకుంటే అన్ని థియేటర్లలో ఫ్రీ షో లు వేసేందుకు అవకాశం ఉంది. కాని ఆయన మాత్రం ఫ్రీ గా సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదు అనేది టాక్‌. మహేష్ బాబు తీరు పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి అభిమానం పేరుతో మహేష్ బాబు టీమ్‌ కోట్లు దండుకుంటున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు పోకిరి సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. రేపు మరింత స్థాయిలో హంగామ ఆ ఉండే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి