mahesh babu rejects ye maya chesave movie
Mahesh Babu : నాగ చైతన్య, సమంత ప్రధాన పాత్రలలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం ఏమాయ చేశావే. ఈ చిత్రం ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ సినిమా నాగ చైతన్య, సమంత కెరీర్స్‌లో మర్చిపోలేని బ్రేక్ ని ఇచ్చింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు గౌతమ్ మీనన్. నిజానికి ఈ సినిమా కోసం ముందుగా నాగచైతన్య ను కాకుండా వేరే హీరోని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఏ మాయ చేశావే స్టోరీని ముందుగా తమిళంలోనే తీయాలని అనుకున్నాడట గౌతమ్ మీనన్. అయితే ఈ కథను మహేష్ బాబుకు వినిపించాలని అనుకున్నాడట.ముందుగా మంజులకు చెప్పాడట. కథ బాగుంది.. కానీ మహేష్ పిక్ చేసుకుంటాడా? లేదా? అన్నది అనుమానమే అని మంజుల చెప్పిందట. ఇక మహేష్ బాబుకు ఈ కథ చెబితే.. చిన్న స్టోరీ కదా? అని అనేశాడట. గౌతమ్ మీనన్ మహేష్ బాబు కలిసి చేస్తున్నారంటే అంచనాలు వేరేలా ఉంటాయ్ కదా? ఏదైనా యాక్షన్ కథ చేద్దామని అన్నాడట మహేష్ బాబు. ఒక వేళ ఆ సినిమాను మహేష్ బాబు చేసి ఉంటే.. పెద్ద సినిమా అయ్యేదని గౌతమ్ మీనన్ అన్నాడు.
mahesh babu rejects ye maya chesave movie
కానీ కార్తీక్ పాత్రలో జెస్సీ చుట్టూ తిరిగే అబ్బాయిగా మహేష్ బాబు చేసి ఉంటే.. సినిమా రిజల్ట్ ఎలా ఉండేదో. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు ఆ సినిమా చేసి ఉంటే పోయేదని కొందరు.. మహేష్ బాబు చేసి ఉంటే క్లాసిక్‌గా ఎప్పటికీ నిలిచిపోయేదని ఇంకొందరు అంటున్నారు. స్టార్స్‌కి ఇలాంటి హిట్స్ మిస్ అవ్వడం కామనే అని మరి కొందరు అనుకుంటున్నారు. నిజంగా “ఏ మాయ చేసావే” సినిమాలో మహేష్ బాబు ఉంటే ఎలా ఉంటుందో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు.
mahesh babu rejects ye maya chesave movie
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.