Mahesh Babu : కొద్ది నిమిషాల యాడ్ కోసం మ‌హేష్ అన్ని కోట్లు తీసుకున్నాడా.. నోరెళ్ల‌పెడుతున్న నెటిజ‌న్స్

Authored By Sam C | The Telugu News | Published on: February 7, 2022, 8:00 pm

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న మ‌హేష్ బాబు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు యాడ్స చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. తాజాగా ఆయ‌న‌కు సంబంధించిన‌న ఓ వార్త ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌హేష్ బాబు ఇప్ప‌టికే ప‌లు బ్రాండ్‌ల‌కు మ‌హేష్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో థ‌మ్స‌ప్ యాడ్‌లో న‌టించిన మ‌హేష్ ఇప్పుడు మ‌రొక కూల్ డ్రింక్ యాడ్ లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. మౌంటెన్ డ్యూ యాడ్‌కి సంబంధించిన వీడియోల‌ను ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో ఖాతాలో మ‌హేష్‌ పోస్ట్ చేసాడు.

ఈ యాడ్‌ని హాలీవుడ్ రేంజ్‌లో దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా దగ్గర షూట్ చేశారు. హిందీలో ఈ యాడ్ హృతిక్ రోషన్ చేశాడు. ఇదిలా ఉంటే తెలుగులో ఏడాది పాటు మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్ ప్రమోట్ చేయడానికి మహేష్ ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా ఈ బ్రాండ్ ఆయనే ప్రమోట్ చేశాడు.అప్పుడు 7 కోట్లు తీసుకున్న మహేశ్.. ఈ సారి 5 కోట్లు అధికంగా తీసుకున్నాడు. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ మౌంటెన్ డ్యూ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ ను మహేశ్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 12 కోట్ల రెమ్యునరేషన్ ను మహేశ్ అందుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

mahesh babu remuneration for lates ad

mahesh babu remuneration for lates ad

Mahesh Babu : రేంజ్ పెంచేశాడుగా..!

ప్ర‌స్తుతం మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ గురించి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చర్చ న‌డుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నాడు. ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్ర షూటింగ్ మార్చ్ నాటికి పూర్తి కానుంది. మే 12న సినిమాని విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రం కూడా ఇదే ఏడాది పూర్తి చేయాలని చూస్తున్నాడు.అనంతరం రాజ‌మౌళితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు మ‌హేష్.

Sam C

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp