Mahesh Babu : మహేశ్ బాబు అభిమానులకు సర్‌ప్రైజ్.. ‘సర్కారు వారి పాట’ టైటిల్ ట్రాక్ రిలీజ్..
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. కాగా, ఈ సినిమా అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులు, మహేశ్ అభిమానులకు చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
Mahesh Babu : 48 సెకన్ల సాంగ్ వినిపించిన మ్యూజిక్ డైరెక్టర్..
‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన పిక్చర్ లో మహేశ్ సరసన బ్యూటిఫుల్ కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాలేదు. కాగా, తాజాగా థమన్ ‘సర్కారు వారి పాట’ టైటిల్ ట్రాక్ వినిపించాడు.

mahesh babu sarkaru vari pata film title song released
ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన వీడియో విడుదల చేశాడు. వీడియోలో 48 సెకన్ల పాటు థమన్ చిత్ర టైటిల్ సాంగ్ ను ప్లే చేశాడు. ఇకపోతే త్వరలో మూవీ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ రాబోతున్నదని థమన్ చెప్పకనే చెప్పేశాడు.
And We Started it for Our S⭐️???????? pic.twitter.com/Ihnlc0MHMD
— thaman S (@MusicThaman) January 22, 2022