Mahesh Babu : స్టార్ డైరెక్ట‌ర్ మ‌హేష్ బాబు క్ష‌మాప‌ణ‌లు ఎందుకు చెప్పాడు.. ఏం త‌ప్పు చేశాడు..!

Authored By Sam C | The Telugu News | Published on: February 6, 2022, 2:30 pm

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సింపుల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్ అనే విష‌యం తెలిసిందే. త‌న ప‌ని తాను చేసుకుంటూ వీలు కుదిరిన‌ప్పుడల్లా ఫ్యామిలీతో స‌ర‌దాగా టూర్స్ వేస్తుంటాడు. షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతోనే షికార్లు చేసే మహేష్ సినిమా సినిమాకి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్లు కూడా వేస్తుంటాడు. అలానే ఒకసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉండగా ముంబైలోని ఓ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారట. పక్కనే దర్శకుడు మెహర్ రమేష్ ఫ్యామిలీ కూడా ఉంది. మెహర్ రమేష్ కుటుంబంతో మహేష్ ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది.

అయితే తాజాగా మ‌హేష్ అన్‌స్టాప‌బుల్ షోలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు. ముంబైలో మారిటన్ హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. ఫ్యామిలీ అంతా ఉంది. ఓ ఇద్దర అమ్మాయిలు వచ్చారు. సెల్ఫీ అని అడిగారు. ఇప్పుడు కాదు.. ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పాను. దీంతో ఆ అమ్మాయిలు వెళ్లిపోయారు. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? డైరెక్టర్ శంకర్ గారి కూతుళ్లు అని మెహర్ రమేష్ చెప్పాడు. దీంతో వెంటనే పరిగెత్తుకుని కిందకు వెళ్లాను. సారీ సర్ మీ అమ్మాయిలు అని తెలియక అలా అన్నాను అని చెప్పాను. పర్లేదు.. హీరోలంటే ఎలా ఉంటారో వాళ్లకి కూడా తెలియాలి కదా? అని శంకర్ అన్నాడట.

mahesh babu says sorry to shankar

mahesh babu says sorry to shankar

Mahesh Babu : మ‌హేష్ స‌ర్ధి చెప్పాడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి.. ఆయనకు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 46 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ మహేష్ బాబు అంటే అందరికీ అదే పిచ్చి. అందగాడు అనే పదానికి మహేష్ తప్ప మరో నిదర్శనం లేదంటుంటారు ఫ్యాన్స్. అమ్మాయిలకు కలల రాకుమారుడు ఈయన. అంతగా ఇమేజ్ సంపాదించుకున్నాడు సూపర్ స్టార్. మహేష్ వీలైనంత వరకు ఫ్యాన్స్‌తో సమయం గడపడానికి ఇష్టపడుతుంటాడు. అయితే ఒక్కోసారి ఫ్యామిలీ టైమ్ ఉన్నపుడు మాత్రం ఆయన ఎవరినీ పట్టించుకోడు. ముఖ్యంగా అభిమానులను కూడా తన వరకు వచ్చినా.. నెమ్మదిగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్తుంటాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp