Mahesh Babu : సినీ, రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలెందరినో ప్రభావితం చేసిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు.ఇప్పటికే ఆయన బయోపిక్స్ వచ్చాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జీవిత కథతో వచ్చిన సినిమా అంటే సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ పాత్రలో నటించిన అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచనలం సృష్ఠించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అఖండ విజయాన్ని దక్కించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీ అని చెప్పాల్సిందే. ఇదే పాత్రలో సీనియర్ ఎన్.టి.ఆర్ నటించారు. కానీ, అది కొద్దిసేపే.
ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాను అల్లూరి సీతారామరాజు, కొమురమ్ భీమ్ పాత్రల ఆధారంగానే తెరకెక్కించారు. అయితే, ఇది ఎక్కువ భాగం ఫిక్షన్ స్టోరీతోనే తెరకెక్కింది. చరణ్ ఆర్ఆర్ఆర్
సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణను తప్ప మరెవరినీ ఊహించుకోలేకపోతున్నారు అభిమానులు, ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చూడటం జరిగింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ..సర్కారు వారి పాట పోకిరి, దూకుడు సినిమాలకంటే పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. అలాగే జరిగింది
అన్నారు. అలాగే, మహేశ్ బాబు..మీరు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను మళ్ళీ రీమేక్ చేసి నటిస్తారా అని అడగగా..ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హండ్రెడ్ పర్సెంట్ చేయడు.. అని తేల్చిపారేశారు. సో మహేశ్ ఎప్పటికీ తండ్రి నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను మళ్ళీ రీమేక్ చేయడని సూపర్ స్టార్ సూపర్ క్లారిటీ ఇచ్చారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.