Mahesh Babu : మహేశ్ ‌బాబు 100 పర్సెంట్ అల్లూరి సీతారామ రాజుగా చేయడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : మహేశ్ ‌బాబు 100 పర్సెంట్ అల్లూరి సీతారామ రాజుగా చేయడా..?

 Authored By govind | The Telugu News | Updated on :20 May 2022,7:00 pm

Mahesh Babu : సినీ, రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలెందరినో ప్రభావితం చేసిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు.ఇప్పటికే ఆయన బయోపిక్స్ వచ్చాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జీవిత కథతో వచ్చిన సినిమా అంటే సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ పాత్రలో నటించిన అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచనలం సృష్ఠించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అఖండ విజయాన్ని దక్కించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీ అని చెప్పాల్సిందే. ఇదే పాత్రలో సీనియర్ ఎన్.టి.ఆర్ నటించారు. కానీ, అది కొద్దిసేపే.

ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాను అల్లూరి సీతారామరాజు, కొమురమ్ భీమ్ పాత్రల ఆధారంగానే తెరకెక్కించారు. అయితే, ఇది ఎక్కువ భాగం ఫిక్షన్ స్టోరీతోనే తెరకెక్కింది. చరణ్ ఆర్ఆర్ఆర్
సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణను తప్ప మరెవరినీ ఊహించుకోలేకపోతున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

Mahesh Babu Should Cheyada 100 Percent Alluri Sitarama Raju

Mahesh Babu Should Cheyada 100 Percent Alluri Sitarama Raju

Mahesh Babu : హండ్రెడ్ పర్సెంట్ చేయడు.. అని తేల్చిపారేశారు.

ఇదిలా ఉంటే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చూడటం జరిగింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ..సర్కారు వారి పాట పోకిరి, దూకుడు సినిమాలకంటే పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. అలాగే జరిగింది
అన్నారు. అలాగే, మహేశ్ ‌బాబు..మీరు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను మళ్ళీ రీమేక్ చేసి నటిస్తారా అని అడగగా..ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హండ్రెడ్ పర్సెంట్ చేయడు.. అని తేల్చిపారేశారు. సో మహేశ్ ఎప్పటికీ తండ్రి నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను మళ్ళీ రీమేక్ చేయడని సూపర్ స్టార్ సూపర్ క్లారిటీ ఇచ్చారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది