Mahesh Babu Son : మహేష్ బాబు కొడుకు గౌతమ్ విదేశాలలో స్టేజిపై వేసిన డాన్స్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu Son : మహేష్ బాబు కొడుకు గౌతమ్ విదేశాలలో స్టేజిపై వేసిన డాన్స్ వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :1 December 2022,7:30 pm

Mahesh Babu Son : సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు ఘట్టమనేని గౌతమ్ అందరికీ సుపరిచితుడే. కొడుకు అంటే మహేష్ బాబుకి ఎంతో సెంటిమెంట్. గౌతమ్ గర్భంలో ఉన్నప్పుడు మహేష్ “పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో మహేష్ ఎటువంటి స్టార్ డామ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత గౌతమ్ నీ సుకుమార్ దర్శకత్వంలో తాను నటించిన “వన్ నేనొక్కడినే” చిత్రం ద్వారా మహేష్ స్క్రీన్ ఎంట్రీ ఇప్పించాడు. ఈ సినిమాలో గౌతమ్ చాలా చక్కగా నటించాడు.

గౌతమ్ మరియు మహేష్ బాబు ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చే సన్నివేశం… సూపర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ కొడుకు గౌతమ్ ని స్క్రీన్ మీదకు తీసుకురాలేదు. మరోపక్క గౌతమ్ మహేష్ బాబు కంటే ఎత్తు ఎదుగుతూ.. విదేశాలలో చదువుతూ ఉన్నాడు. వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే సితార కంటే గౌతం చాలా సైలెంట్. ఈ క్రమంలో గౌతమ్ విదేశాలలో చదువుతూ స్కూల్లో ఇటీవల నాటకం వేయడం జరిగింది. ఆ నాటకంలో స్టేజిపై గౌతమ్ వేసిన స్టెప్పుల వీడియో నమ్రతా శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది.

Mahesh Babu Son Gautham Ghattamaneni dance video viral

Mahesh Babu Son Gautham Ghattamaneni dance video viral

సేమ్ తండ్రి మహేష్ బాబు మాదిరిగానే… గౌతమ్ స్టెప్పులు ఉన్నాయని వీడియోకి కామెంట్లు వస్తున్నాయి. “అతడు” సినిమాలో మహేష్ లుక్కు మాదిరిగా గౌతమ్ గెటప్ ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో సూపర్ స్టార్ రెడీ అవుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా చాలా సైలెంట్ గా ఉండే గౌతమ్ స్టేజిపై డాన్స్ చేస్తూ.. ఉండే వీడియో బయటకు రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది