Mahesh Babu : మహేశ్ బాబు అలా చేయడం మంచి పనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్న సూపర్ స్టార్ అభిమానులు..
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం మహేశ్ ఏర్పరుచుకున్నారు. మహేశ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ‘1: నేనొక్కడినే’ అనే సినిమా చేశారు. ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో కాలేదు. కానీ, ఫిల్మ్ మేకింగ్, స్టోరి, హీరో ఎలివేషన్, సీన్స్, మ్యూజిక్ పరంగా అయితే విజయం సాధించిందని సినీ అభిమానులు అంటుంటారు. ఈ సంగతి అలా ఉంచితే.. మహేశ్ సుకుమార్‌తో మరో సినిమా చేయాల్సి ఉండగా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల చేయలేకపోయాడు.
సుకుమార్ ‘పుష్ప’ సినిమా కథను తొలుత మహేశ్‌కు వినిపించాడని ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియా వేదికగా ఉంటున్నారు. అయితే, మహేశ్‌కు ఈ కథ నచ్చలేదట. అలా ఈ ఫిల్మ్ బన్నీ వద్దకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. కాగా, కొందరు అభిమానులు క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తాను సుకుమార్‌తో సినిమా చేయలేకపోతున్నానని మహేశ్ గతంలో చేసిన ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ట్విట్టర్ వేదికగా మహేశ్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పుష్పకు నో చెప్పి మంచి పని చేశావ్ అన్నా అని కొందరు మహేశ్ అభిమానులు అంటున్నారు.
Mahesh Babu : అలా చేసి మంచి పని చేశావ్.. మహేశ్..!
దాంతో బన్నీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ‘తగ్గేదేలే’ సినిమా సంగతి ముందర తెలుస్తుందని అంటున్నారు.బన్నీ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోతారని, సినిమా ఊర మాస్ గా ఉందని ఈ క్రమంలోనే బన్నీ ఫ్యాన్స్ చెప్తున్నారు. బన్నీని సుకుమార్ నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో ప్రజెంట్ చేశాడని,బన్నీ కెరీర్ లో మైల్ స్టోన్ గా ఈ సినిమా నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అంటున్నారు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా ‘శ్రీవల్లి’గా బ్యూటిఫుల్ రష్మిక మందన నటించింది.