
mahesh babu thinking about goutham
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్‌కి తప్పక సమయం కేటాయిస్తుంటాడు. భార్య, పిల్లల వ్యవహారాలకి సంబంధించి అప్రమత్తంగా ఉంటాడు. ఈ మధ్యనే మహేష్ తన ఫ్యామిలీతో రెండు మూడు దేశాల్లో హాలీడేస్ గడిపి వచ్చారు. సర్కారు వారి పాట తరువాత విదేశాలకు వెళ్లారు. త్వరలో త్రివిక్రమ్ డైరక్షన్ లో హారిక హాసిని నిర్మించే సినిమాను స్టార్ట్ చేయాల్సి వుంది. అయితే మళ్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు.అయితే ఈసారి విదేశాలకు వెళ్లేది వెకేషన్ కు కాదు. కొడుకు గౌతమ్ ను విదేశాల్లోని కాలేజీల్లో చేర్పించడానికి అని వినిపిస్తోంది.
ఏ కాలేజీ, ఏ కోర్సు, ఏ దేశం అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలో తెలుస్తాయి. కానీ ప్రస్తుతం గౌతమ్ ఇంటర్ ఇక్కడే జాయిన్ అయ్యాడు. అందువల్ల మళ్లీ మార్చి విదేశాల్లో వేస్తున్నారా? అన్నది క్లారిటీ లేదు. గౌతమ్ 2006 ఆగస్టులో హైదరాబాద్ లోనే జన్మించాడు. స్టార్ కిడ్ గా గౌతమ్ అందరికీ తెలుసు. గౌతమ్ ఇటీవల తన స్కూల్ ఎడ్యుకేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో తాజాగా పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల పది ఫలితాలు కూడా వెలువడ్డాయి. గౌతమ్ టెన్త్ రిజల్ట్స్ లో ప్రథమ గ్రేడ్ ను సాధించాడు.
mahesh babu thinking about goutham
దీంతో కుటుంబ సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు. గౌతమ్ టెన్త్ ఫలితాలపై తల్లిదండ్రులు మహేష్ బాబు, నమ్రత గౌతమ్ ను అభినందిస్తూ తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు కూడా పెట్టారు. గౌతమ్ చదువుతో పాటు ఇతర యాక్టివిటీల్లోనూ చురుకుగానే ఉంటున్నారు. ఇప్పటికే తన తండ్రి మహేశ్ బాబు తో కలిసి చైల్డ్ ఆర్టిస్గ్ గా ‘1 నేనొక్కడినే’ చిత్రంలో నటించాడు. బిగ్ స్క్రీన్ పై కనిపించి తెలుగు ఆడియెన్స్ ను పరిచయం చేసుకున్నాడు. అదేవిధంగా 2018లోనే గౌతమ్ తన ప్రొఫెషనల్ స్విమ్మింగ్‌ని ప్రారంభించి, తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ పోటీల్లో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.