Mahesh Babu : 5 సెక‌న్లుకు అన్ని కోట్లా.. మ‌హేష్ బాబు క్రేజ్ మామూలుగాలేదు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mahesh Babu : 5 సెక‌న్లుకు అన్ని కోట్లా.. మ‌హేష్ బాబు క్రేజ్ మామూలుగాలేదు..!

Mahesh Babu : టాలీవుడ్ Tollywood  స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువేే. ఎందుకంటే ఒకవైపు స్టార్ హీరోగా తన కెరియర్ ను కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నో సేవా సంస్థలు అలాగే బిజినెస్ లను చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో బిజినెస్ ల కు బ్రాండింగ్ గా ఉన్న మహేష్ బాబు వేరే లెవల్ అని చెప్పాలి. అయితే మహేష్ బాబు కోసం ఎక్కడెక్కడ నుంచో కంపెనీలు వెతుక్కుంటూ మరీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Babu : 5 సెక‌న్లుకు అన్ని కోట్లా.. మ‌హేష్ బాబు క్రేజ్ మామూలుగాలేదు..!

Mahesh Babu : టాలీవుడ్ Tollywood  స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువేే. ఎందుకంటే ఒకవైపు స్టార్ హీరోగా తన కెరియర్ ను కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నో సేవా సంస్థలు అలాగే బిజినెస్ లను చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో బిజినెస్ ల కు బ్రాండింగ్ గా ఉన్న మహేష్ బాబు వేరే లెవల్ అని చెప్పాలి. అయితే మహేష్ బాబు కోసం ఎక్కడెక్కడ నుంచో కంపెనీలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. ఇక అలా వచ్చిన కంపెనీలలో ఫోన్ పే కూడా ఒకటి అని చెప్పాలి .అయితే కొన్నేళ్ల క్రితం ఫోన్ పేబ్రాండింగ్ కోసం మహేష్ బాబును కాంట్రాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫోన్ పే ఒక కొత్త ఐడియా ను తీసుకుని వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా అయితే మనం ఎవరికైనా ఎప్పుడైనా సరే ఫోన్ పే Phonepe లో డబ్బులు చెల్లించినట్లయితే, అక్కడున్న స్పీకర్ లో ” రిసీవ్డ్ రుపీస్” అంటూ వాయిస్ వస్తుంది.అయితే అది ఫ్రీ రికార్డిండ్ లేడీ వాయిస్.

అయితే ఇప్పుడు ఆ లేడీ వాయిస్ కి బదులుగా నార్త్ ఇండియాలో అమితాబ్ వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు వాయిస్ ను ఆ స్పీకర్ లో వాడుకోవాలని ఫోన్ పే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అతి త్వరలోనే దీనిని అమలు చేసేందుకు ఫోన్ పే చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనికిగాను మహేష్ బాబుకు ఫోన్ పే దాదాపు 5 కోట్ల పారితోషికం చెల్లించనున్నట్లుగా వార్తలు జోరున ప్రచారం జరుగుతున్నాయి. అయితే ఈ వాయిస్ పెట్టడం వలన ఎవరైనా ఫోన్ పే చేస్తే నేరుగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫోన్ పే చేసినట్లుగా అనిపిస్తుంది అన్నమాట. నిజానికి ఈ ఒప్పందం అనేది కాస్త పాతదే అయినప్పటికీ ఇప్పుడు మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ పరంగా చూస్తే ఇంకా పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తారేమో.. ఇక ఇప్పుడే ఇలా ఉంటే మరి కొద్ది రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఫాన్ ఇండియాకు పరిచయం కాబోతున్నారు. ఇక అప్పుడు ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి .

ఎందుకంటే రాజమౌళి SS Rajamouli  చేతిలో పడిన తర్వాత ఎవరైనా సరే పాన్ ఇండియా స్థాయిలో , పాన్ వరల్డ్ Pan India స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలా రాజమౌళి ద్వారా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోలందరూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇలాంటి నేపథ్యంలో రేపు మహేష్ బాబు కూడా ఆ జాబితాలో చేరతారని అర్థమవుతుంది. దీంతో ఫోన్ పే మహేష్ బాబు వాయిస్ ఈ విధంగా వాడుకొని వారి బిజినెస్ ను మరింత పెంచేందుకు చూస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ న్యూస్ విన్న తర్వాత నేటిజనులు పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నేటిజన్ కామెంట్ చేస్తూ కృష్ణ గారు డబ్బులు వదిలేసి మరి సినిమాలు చేశాడు అంటారు… కానీ మహేష్ బాబు మాత్రం ఫిలిమ్ ఇండస్ట్రీ తో పాటు యాడ్ ఇండస్ట్రీని కూడా కలిపి దున్నేస్తున్నాడు. బహుశా వారి నాన్నను చూసి ఇలా ఉంటే కష్టమని ఫిక్స్ అయ్యాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది