సర్కారు వారి పాట ని కామెడి సినిమా చేసేస్తే మహేష్ ఇమేజ్ ఏమవ్వాలి ..?

Authored By vamana sai | The Telugu News | Published on: December 28, 2020, 2:00 pm

సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ డైరెక్టర్ పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న లేటెస్ట్ సినిమా. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం బ్యాక్ డ్రాప్ లో సర్కారు వారి పాట కథ సాగుతుందట. టాలీవుడ్ లో ఇప్పటి వరకు మహేష్ బాబు పాన్ ఇండియన్ సినిమా చేయకపోవడం తో సర్కారు వారి పాట ని పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ మరొక హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

Tollywood: Superstar Mahesh Babu gives two offers to this heroine

 

కాగా ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలవబోతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన బ్యాంక్ సెట్ లో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేయబోతున్నారట. దాదాపు ఈ షెడ్యూల్ నెల రోజుల కి పైగానే సాగుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత అమెరికాలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికా షెడ్యూల్ ఉంటుందా లేదా అన్నది క్లారిటీ లేనప్పటికి మేజర్ పార్ట్ మాత్రం విదేశాలలో ఉండబోతుందని అంటున్నారు.

Keerthy Suresh in Sarkaru Vaari Paata Movie | Sarkaru Vaari Paata Movie Latest Update | Mahesh Babu - YouTube

ఇక ఈ సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. వరసగా భారీ హిట్స్ అందుకుంటున్న మహేష్ బాబు కి సర్కారు వారి పాట మరో లెవల్ సినిమా కాబోతోందని చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం దర్శకుడు పరశురాం ఈ సినిమాలో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ ని రాశాడట. ఆ కామెడీ ట్రాక్ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని చెప్పుకుంటున్నారు. కాని కొంతమంది మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుకుంటున్నారట. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సర్కారు వారి పాట సినిమాని అనవసరమైన కామెడి ట్రాక్ పెట్టి కామెడీ సినిమా చేసేస్తారేమో అని కామెంట్స్ చేస్తున్నారట. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp