Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నుండి ఈ వారం అతను ఔట్.. రీఎంట్రీ ఎప్పుడో తెలుసా?
Bigg Boss OTT Telugu : బుల్లితెరపై సందడి చేసిన బిగ్ బాస్ షో ఇప్పుడు ఓటీటీలోను అదరగొడుతుంది. ఈ కార్యక్రమంకి సంబంధించి ప్రతి రోజు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. హౌజ్‌లోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు వంటి విషయాలపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్లు కంప్లీట్‌కాగా, ఆరో సీజన్ `బిగ్‌బాస్ నాన్‌స్టాప్` పేరుతో ఓటీటీలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. 24 గంటలు కంటిన్యూగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఏడు వారాలు పూర్తి చేసుకుంది. 17 మందితో స్టార్ట్ అయిన ఈ షోలో ఇప్పుడు 11 మంది ఉన్నారు.
అయితే ఈ వారం మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు.బిగ్ బాస్ నాన్‌స్టాప్ నుండి ఇప్పటి వరకు శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం అనిల్, నటరాజ్, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అరియానా, మహేశ్ విట్టా నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా సస్పెన్స్ గా మారింది.మనకు అందుతున్న సమాచారం మేరకు మహేష్ విట్టా ఎలిమినేట్ అవుతాడని తెలుస్తుంది. ఓట్ల విషయం పక్కన పెడితే ఎప్పటిలాగే ఈవారం కూడా మిత్ర శర్మ సేఫ్. మిగిలిందల్లా అనిల్, మహేశ్. ఇద్దరూ గేమ్ ఎవరి స్టైల్‌లో వారు గేమ్ ఆడుతున్నారు, కానీ శ్రమకు తగ్గ గుర్తింపు మాత్రం దొరకడం లేదు.

mahesh vitta out from Bigg Boss OTT Telugu
Bigg Boss OTT Telugu : ఆసక్తికర అప్‌డేట్స్..
ఇంకా చెప్పాలంటే అనిల్ ఇంట్లో ఉండీలేనట్టుగా ఉంటున్నాడు.మహేశ్ గతంలో కంటే కూడా చాలా మెరుగయ్యాడు. హౌస్‌మేట్స్‌కు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. టాప్ 5కి చేరుకునే సత్తా ఉంది. కానీ అనూహ్యంగా అతడిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఏడో వారం మహేశ్ ఎలిమినేట్ అయ్యాడని లీకువీరులు దండోరా వేసి చెప్తున్నారు. నిజానికి ఓట్ల పరంగా అతడు మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ కావాలనే అతడిని గేమ్ నుంచి తప్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆయన స్థానంలో మరో కంటెస్టెంట్‌ని రంగంలోకి దించుతున్నారట. బాబా మాస్టర్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.