Sridevi Drama Company : టీఆర్పీ స్టంట్లు అంటూ పరువుతీసుకున్నారు.. మల్లెమాల టీంపై నెటిజన్లు ఫైర్
Sridevi Drama Company : బుల్లితెరపే టీఆర్పీ స్టంట్లు అంటూ కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నారు. వారి వారి పైత్యాలను చూపిస్తున్నారు. అలా ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ హద్దులు కూడా దాటేస్తోంది. గత వారం రిలీజ్ చేసిన ఓ ప్రోమో చూసి అందరూ మల్లెమాల టీంను తెగ తిట్టేశారు. అందులో చేసినవన్నీ కూడా ప్లాన్డ్ అని అందరికీ అర్థమైంది. పూర్ణ మీద ఇమాన్యుయేల్ చేతులు వేయడం, రష్మీ కళ్లు తిరిగి కిందపడిపోవడం అన్నీ చూశాం. అయితే జనాలు మాత్రం ఇవన్నీ స్టంట్లేనని అందరూ కనిపెట్టేశారు. అయితే దానికి అనూహ్యంగా వారు కూడా అవే పేర్లు పెట్టేశారు. టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో చూపించారు. అందులో భాగంగా అందరూ రెచ్చిపోయారు.
రాం ప్రసాద్ వచ్చి.. టీఆర్పీ స్టంట్లు ఎలా ఉండాలో చెప్పేశాడు.ఆ వెంటనే రష్మీ మొదలెట్టేసింది. రష్మి ఒక్కసారిగా కళ్లు తిరిగిపడిపోయింది. ఏమై ఉంటుందా? అని అందరూ ఆందోళన చెందుతుంటారు. తీరిగ్గా రష్మీ కన్ను కొట్టి.. ఈ స్టంట్ ఎలా ఉందని అడుగుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక పూర్ణ అయితే ఒక్కసారిగా అవాక్కవుతుంది. వచ్చిన మొదటి సారే ఇంత చేస్తే ఎలా అని పూర్ణ స్టేజ్ మీదకు వచ్చి అంటుంది. ఇంతలో పూర్ణ భుజం మీద ఇమాన్యుయేల్ చేతులు వేస్తాడు. ఒక్కసారిగా ఫైర్ అవుతుంది. అలా ఎలా చేస్తావ్ అంటూ ఇమాన్యుయేల్ మీద పూర్ణ ఫైర్ అవుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇమాన్యుయేల్‌ను అందరూ దూరం తీసుకుపోతారు. నాకు ఆ చనువు ఉంది కాబట్టే..

Mallemala Sridevi Drama Company TRP STunts Episode
వేశాను అని ఇమాన్యుయేల్ అనేశాడు. నేను అందరితోనూ అలానే క్లోజ్‌గా ఉంటాను.. కానీ మీరు అలా చేస్తే ఉండటం కష్టం.. అని చెబుతూ స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయింది. అలా తన సీటు మీద తాను కూర్చుంది. అలా కూర్చున్న తరువాత పూర్ణ అసలు విషయం చెప్పేసింది. ఇదెలా ఉంది స్టంట్ అని అసలు కథ రివీల్ చేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇమాన్యుయేల్ అయితే గుండె జారిపోయిందన్నట్టుగా భయపడ్డాడు. ఆ తరువాత పూర్ణ వద్దకు వచ్చి.. హగ్ చేసుకుంటాడు ఇమాన్యుయేల్. మొత్తానికి టీఆర్పీ స్టంట్లను మాత్రం జనాలు ఆసహ్యించుకుంటున్నారు. మల్లెమాలను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
