Mallemala : ఇంకెన్నాళ్లు ఇలాంటి పనులు చేస్తారు.. మల్లెమాలను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Authored By aruna | The Telugu News | Published on: August 12, 2022, 1:20 pm

Mallemala : మల్లెమాల మీద కొందరికి మంచి అభిప్రాయం ఉంది.. ఇంకొందరికి చెడు అభిప్రాయం ఉంది. బుల్లితెరపై మల్లెమాలది ఓ చరిత్ర. ఎంటర్టైన్మెంట్ షోలు చేయడం, కొత్తగా ఆలోచించడంతో మిగతా వారికంటే మల్లెమాల ఎంతో ముందుంటుంది. అయితే మల్లెమాల మీద ఒక్కోసారి ప్రేక్షకులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మల్లెమాల చేసే పనులతో జనాలు విసిగెత్తిపోతోంటారు. ప్రతీసారి జనాలను పిచ్చోళ్లని చేసేందుకు మల్లెమాల వేసే స్టంట్లతో జనాలకు చిర్రెత్తుకొస్తుంటుంది. టీఆర్పీల కోసం జనాలను పిచ్చోళ్లని చేసేందుకు నానా రకాల పాట్లు పడుతుంటారు. అలా ఇప్పుడు తాజాగా మరో కొత్త నాటకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. మంచిగా నడుస్తున్న శ్రీదేవీ డ్రామా కంపెనీకి ఇలాంటి పిచ్చి చేష్టలు, టాస్కులు పెట్టి, కాంట్రవర్సీలకు తెరలేపి, ప్రోమోలను వైరల్ చేయించుకుంటున్నారు. చివరకు షోలో మాత్రం ఏమీ ఉండదు. అది అందరికీ తెలిసిందే. తెలిసినా కూడా అటు మల్లెమాల ఇలాంటి టీఆర్పీ స్టంట్లను మానడం లేదు.

తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కొత్తగా ఓ కాన్సెప్ట్ పెట్టారు. బిగ్ బాస్ షోలో మాదిరిగా.. నచ్చని వాళ్ల ఫోటోలను కాల్చేయాలని టాస్క్ పెట్టారు. ఇందులో అందరూ ఆది ఫోటోనే కాల్చేశారు. రష్మీ, రాం ప్రసాద్.. ఆకరికి పరదేవీ కూడా ఆది ఫోటోనే కాల్చేశాడు. ఇందులో ఎంత నిజం ఉంది.. ఎందుకు చేశారో మాత్రం తెలియడం లేదు.. కానీ ప్రోమోను మాత్రం ఇలా కాంట్రవర్సీగా కట్ చేశారు. దీనిపై జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Mallemala : మల్లెమాలపై నెటిజన్ల ఆగ్రహం..

అయ్యయ్యో వద్దమ్మా! ఇప్పటికే ఇలాంటివి చాలా చూశాం మళ్ళీ అంటే కష్టం, ఇలాంటి ప్రాంకులు చేస్తున్న మల్లమాల టీమ్ కీ, ఇంత వరకు లేని ఈ సంస్కృతి ఇప్పుడు ఎందుకు, అందరూ కలిసి ఉండాలని, కళామతల్లి ముద్దు బిడ్డలై మమ్మల్ని ఆనందింపచేయాలని కోరుతూ…. ఆది అల్ప సంతోషి, ఆది, రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, రష్మీ ఈ షో కి నాలుగు స్థంభాలు, చుాసాం చుాసాం.. చాలా చుాసాం.. ఈ ప్రాంకులు.. ఇవి ప్రోమెా లాస్ట్ లో ప్రతీసారి కామన్ కదా…అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ మల్లెమాలను ఏకిపారేస్తున్నారు.

aruna

No bio available for this author.

  1. "Today Horoscope : 23 నవంబర్ 2026 సోమ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు.. ఈ రాశులకు ధనలాభం..!"

  2. "Samsung Galaxy S25 Ultra : అబ్బా ఏం ఆఫర్.. రూ.1.30 లక్షల ఫోన్ రూ.50 వేలకే?.. ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్..!"

  3. "Gold Price Crash : బంగారం ధరలు భారీగా తగ్గినా కొనడానికి వెనుకడుగు.. అసలు 5 కారణాలు ఇవే!"

  4. "8th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు డబుల్ గుడ్‌న్యూస్ ? రూ.18 వేల జీతం రూ.65 వేలకు వ‌ర‌కు పెరిగే చాన్స్‌?"

  5. "Peerzadiguda Pulse Polio : పీర్జాదిగూడలో పోలియో చుక్కలు .. ప్రతి చిన్నారికి రక్షణ కల్పించాలి: తవిటి ప్రశాంత్ కుమార్"

  6. "IND A vs PAK A : పాక్ బ్యాటర్‌తో హర్షిత్ రాణా మాటల యుద్ధం.. మైదానంలో హైడ్రామా!"

  7. "Chengicherla Indiramma Illu : చెంగిచెర్ల ఎస్సీ బస్తీలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం.. తోటకూర అజయ్ యాదవ్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp