Hyper Aadi : మల్లెమాలకు పెద్ద షాక్ ఇవ్వబోతున్న హైపర్ ఆది.. సార్ హిట్ అయితే ఖతమే!!
Hyper Aadi : జబర్దస్త్ లో మొన్నటి వరకు హైపర్ ఆది యొక్క స్థానం ఏంటో అందరికీ తెలిసిందే, ఆయన టీం లీడర్ గా వ్యవహరించిన సమయంలో ఎపిసోడ్ కి రేటింగ్ విపరీతంగా నమోదయింది. జబర్దస్త్ కార్యక్రమంలో ఇప్పుడు హైపర్ ఆది లేడు… అయినా కూడా ఆయన తాలూకు కామెడీ కంటిన్యూ అవుతుంది. ఇక ఢీ డాన్స్ షో మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో హైపర్ ఆది సందడి చేస్తున్నాడు. ఈటీవీ కి ఆ రెండు కార్యక్రమాలు అత్యంత కీలకం అనే విషయం తెలిసిందే.
అయితే ఆ రెండు కార్యక్రమాల నుండి కూడా హైపర్ ఆది తొలగి అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో హైపర్ ఆది కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా సక్సెస్ అయి ఆది పాత్రకు మంచి గుర్తింపు వస్తే ఖచ్చితంగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ నుండి కూడా హైపర్ ఆదికి వరుసగా ఆఫర్స్ తలుపు తట్టే అవకాశం ఉంది. అదే జరిగితే శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఇతర కార్యక్రమాలను హైపర్ ఆది వదిలేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే మల్లెమాలు వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నింటికీ దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది. హైపర్ ఆది కూడా వెళ్లిపోతే ఈటీవీ రేటింగ్ మరింతగా పడిపోయే అవకాశాలు లేక పోలేదు అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. హైపర్ ఆది సినిమాలతో బిజీగా అయితే బుల్లి తెరకు గుడ్ బై చెప్పడం మంచిదే, కానీ సుడిగాలి సుదీర్ మాదిరిగా మాత్రం అటు వెండి తెరకు ఇటు బుల్లి తెరకు కాకుండా పోవద్దంటూ సలహా ఇస్తున్నారు.