Manchu Family : రంగంలోకి దిగిన మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌.. ఇన్నాళ్లు ఎటు పోయారండీ బాబు?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 24, 2022, 5:00 pm

Manchu Family : మంచు మోహన్ బాబు మరియు ఆయన కొడుకు మంచు విష్ణు లపై సోషల్ మీడియాలో కొందరు జనాలు పని గట్టుకని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరూ మాట్లాడుతున్న మాటలు మరియు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా కారణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలు వారికి ఇబ్బంది గా మారాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా బాడ్ కామెంట్స్ తో వీరిద్దరిని చాలా దారుణంగా అవమానిస్తూ పోస్ట్ లు వస్తున్నాయి. ఈ సమయం లో ఫ్యామిలీని అంతా అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సమయంలోనే మంచు ఫ్యామిలీకి సంబంధించిన అభిమాన సంఘం నాయకుడు మీడియా ముందుకు వచ్చాడు. తమ అభిమాన హీరోలను అగౌరవపరిచే విధంగా ఇకపై సోషల్ మీడియా పోస్ట్‌ లు పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామంటూ పోలీసుల ముందుకు వెళ్లాడు. మంచు ఫ్యామిలీకి అభిమాన సంఘం కూడా ఉండి ఇన్ని రోజులు ఏం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంచు ఫ్యామిలీ హీరో లకు వ్యతిరేకంగా అంతలా ప్రచారం చేస్తుండగా మీరు ఇన్నాళ్లు ఏం చేస్తున్నారు.. వెంటనే మీరు ఎటాక్ ఇవ్వడం చేస్తే సోషల్ మీడియా ద్వారా వారిని విమర్శించడం ఇంత దూరం వ్యవహారం వచ్చేది కాదు కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మంచు ఫ్యామిలీకి మీ అండదండలు ఉండడం అభినందనీయం. వారు ఇండస్ట్రీలో కచ్చితంగా గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తులు.

manchu family fans association come to front to define there hero

manchu family fans association come to front to define there hero

కానీ వారి అతి ప్రవర్తన మరియు మాటల వల్ల కొన్నిసార్లు అవమాన పడుతున్నారు. అది వాళ్ళ నైజం అయినప్పటికీ జనాలు మాత్రం దాన్ని రిసీవ్ చేసుకోలేక పోతున్నారు. అలాంటి సమయంలో మంచు ఫ్యామిలీ అభిమానులు వారికి అండదండగా నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారికి విమర్శలు చేస్తున్న వారు వెనక్కు తగ్గే అవకాశం ఉంది. ముందు ముందు అయినా మంచు అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారి అభిమాన హీరోల పై వచ్చే విమర్శలను ఎప్పటికప్పుడు ఖండించాలని సినీ వర్గాల వారు కూడా సలహా ఇస్తున్నారు. మరి ఇకపై అయినా మంచు వారిపై విమర్శలు తగ్గుతాయా అనేది చూడాలి. అభిమాన సంఘం నాయకుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తో ఎవరినైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Bathing Dinner : భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? నిజం ఇదే"

  2. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  3. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  4. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  5. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  6. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  7. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp