Manchu Manoj : జాతి పేరు చెప్పుకొని అమ్ముడుపోను… అంతా మీ చేతిలోనే అంటున్న మనోజ్
ప్రధానాంశాలు:
Manchu Manoj : జాతి పేరు చెప్పుకొని అమ్ముడుపోను... అంతా మీ చేతిలోనే అంటున్న మనోజ్
Manchu Manoj : ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీ ఎక్కువ వివాదాలతో వార్తలలో నిలుస్తుంది. తన ఆస్తి తనకే దక్కాలని, అక్రమంగా తన ఇంట్లో ఉంటున్న మనోజ్ ను బయటకు పంపాలని మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో.. మనోజ్ బయటకు వచ్చేశాడు. ఇక ఇంత గొడవ అయినా మనోజ్ కే ఎక్కువమంది సపోర్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. అయితే భరత్ హీరోగా పరిచయమవుతున్న జగన్నాథ్ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొన్నాడు మనోజ్. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Manchu Manoj : జాతి పేరు చెప్పుకొని అమ్ముడుపోను… అంతా మీ చేతిలోనే అంటున్న మనోజ్
Manchu Manoj స్టన్నింగ్ కామెంట్స్..
నన్ను ఎంతో మంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరు అని అన్నారు మంచు మనోజ్. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తోక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా, ఆ నాలుగు గోడల మధ్య కు రానీయ్యకపోయినా, నన్ను ఏం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయ్యలేరని నేను గట్టిగా నమ్ముతాను. మీరే నా దేవుళ్లు , మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని.చెట్టు పేరు , జాతీ పేరు చెప్పుకోని మార్కెట్లో అమ్ముడు పోవడానికి ..నేను కాయో, పండునో కాదు.. మీ మనోజ్
మంచు మనోజ్ ని తోక్కుదామని చూస్తారా..?నలుపుదామని చూస్తారా..?నన్ను తోక్కాలన్నా.. లేపాలన్నా అభిమానుల వల్లే అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. నన్ను ఏం చేయాలన్నా అది ఫ్యాన్స్ వల్లే అవుతుంది. న్యాయం కోసం నిలబడ్డానంటే అది జరిగే వరకూ నేను ఎంత దూరమైనా వెళతాను అని మనోజ్ అన్నారు.