
Manchu Family son of india movie digital streaming in prime video
Manchu Family : మంచు మోహన్ బాబు మరియు ఆయన కొడుకు మంచు విష్ణు లపై సోషల్ మీడియాలో కొందరు జనాలు పని గట్టుకని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరూ మాట్లాడుతున్న మాటలు మరియు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా కారణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలు వారికి ఇబ్బంది గా మారాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా బాడ్ కామెంట్స్ తో వీరిద్దరిని చాలా దారుణంగా అవమానిస్తూ పోస్ట్ లు వస్తున్నాయి. ఈ సమయం లో ఫ్యామిలీని అంతా అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సమయంలోనే మంచు ఫ్యామిలీకి సంబంధించిన అభిమాన సంఘం నాయకుడు మీడియా ముందుకు వచ్చాడు. తమ అభిమాన హీరోలను అగౌరవపరిచే విధంగా ఇకపై సోషల్ మీడియా పోస్ట్ లు పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామంటూ పోలీసుల ముందుకు వెళ్లాడు. మంచు ఫ్యామిలీకి అభిమాన సంఘం కూడా ఉండి ఇన్ని రోజులు ఏం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంచు ఫ్యామిలీ హీరో లకు వ్యతిరేకంగా అంతలా ప్రచారం చేస్తుండగా మీరు ఇన్నాళ్లు ఏం చేస్తున్నారు.. వెంటనే మీరు ఎటాక్ ఇవ్వడం చేస్తే సోషల్ మీడియా ద్వారా వారిని విమర్శించడం ఇంత దూరం వ్యవహారం వచ్చేది కాదు కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మంచు ఫ్యామిలీకి మీ అండదండలు ఉండడం అభినందనీయం. వారు ఇండస్ట్రీలో కచ్చితంగా గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తులు.
manchu family fans association come to front to define there hero
కానీ వారి అతి ప్రవర్తన మరియు మాటల వల్ల కొన్నిసార్లు అవమాన పడుతున్నారు. అది వాళ్ళ నైజం అయినప్పటికీ జనాలు మాత్రం దాన్ని రిసీవ్ చేసుకోలేక పోతున్నారు. అలాంటి సమయంలో మంచు ఫ్యామిలీ అభిమానులు వారికి అండదండగా నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారికి విమర్శలు చేస్తున్న వారు వెనక్కు తగ్గే అవకాశం ఉంది. ముందు ముందు అయినా మంచు అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారి అభిమాన హీరోల పై వచ్చే విమర్శలను ఎప్పటికప్పుడు ఖండించాలని సినీ వర్గాల వారు కూడా సలహా ఇస్తున్నారు. మరి ఇకపై అయినా మంచు వారిపై విమర్శలు తగ్గుతాయా అనేది చూడాలి. అభిమాన సంఘం నాయకుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తో ఎవరినైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.