Manchu Lakshmi : మంగళవారం అంటే ఇలానే ఉంటుంది.. ఆ ఫోటోతో షాకిచ్చిన మంచు లక్ష్మి
Manchu Lakshmi : మంచు వారసురాలిగా, మోహన్ బాబు డాటర్‌గా మంచు లక్ష్మి చేసే హంగామా ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. తనదైన మాటతీరుతో అట్రాక్ట్ చేసే ఈ సెలబ్రిటీ కిడ్.. సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక రూపంలో టచ్ లోకి వస్తుంటుంది. సోషల్ మీడియాలో హవా నడిపించడం ఈ మంచువారమ్మాయి హ్యబీ. మంచు ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ మ్యాజిక్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

Manchu Lakshmi shared her hot workout photos
సాధారణంగా మంచు లక్ష్మికి సోషల్ మీడియా వేదిక అంటే కొట్టినపిండి. సమాజంలోని విషయాలతో పాటు తన వ్యక్తిగత వివరాలు పోస్ట్ చేసేందుకు సామజిక మాధ్యమాలను విరివిగా వాడుతుంది మంచు లక్ష్మి. ఆమె పెట్టిన పోస్టులపై ట్రోల్స్ జరిగిన సందర్భాలు బోలెడు. అయితే ఎవరెన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా పెద్దగా పట్టించుకోదు మంచు లక్ష్మి. అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్న వారిపై మండిపడుతూ ఫైర్ అవుతుంటుంది. తాజాగా మంచు లక్ష్మీ అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
Manchu Lakshmi : మంచక్క వర్కవుట్లు వైరల్

Manchu Lakshmi shared her hot workout photos
ఈ క్రమంలోనే తాను వర్కవుట్స్ చేస్తున్న కొన్ని ఫోటోలను ఆమె పంచుకుంది. శరీరాకృతి కోసం తెగ కష్టపడుతూ వ్యయం చేస్తూ ఈ ఫొటోల్లో కనిపించింది. పైగా ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ”మంగళవారం అంటే ఇలానే ఉంటుంది. గైస్ మీరు ఎన్తమంది ఇలా డే స్టార్ట్ చేస్తారు?” అని ట్యాగ్ చేసింది. దీంతో ఆమె కష్టాన్ని చూసి ‘వావ్, సూపర్ మంచు అక్క’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి తన మంగళవారాన్ని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.