Manchu Manoj : జనం కోసం పుట్టిన మన దేవుడు పవన్ కళ్యాణ్ రా.. రేయ్ నాగబాబు మీ తమ్ముడిని చూసి నేర్చుకోరా? వీడియో
Manchu Manoj : మంచు మనోజ్ తెలుసు కదా. చాలా డిఫరెంట్ క్యాండిడేట్. తన మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు మంచు మనోజ్. ఏమాత్రం ఆలోచించడు. ఎవరు ఉన్నా అస్సలు ఆలోచించడడు. ఇటీవల ఓ ఈవెంట్ లో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హై పర్పస్ లేకపోతే ఎప్పుడూ మనిషి తనను తానే డిస్టర్బ్ చేసుకుంటాడని.. ఆ పిచ్చి ముదిరితే పక్కనోళ్లను కూడా డిస్టర్బ్ చేస్తారన్నాడు మంచు మనోజ్. ఉదాహరణకు మొన్న మా ఎన్నికలు జరిగాయని.. పోటీ అంటే రెండు పక్కన ఉంటుంది. ఒకరిద్దరు పోటీ చేశారు. కాకపోతే జనాలు కలిసి ఒక వ్యక్తిని గెలిపించారు.
మా అన్నను ఎన్నుకున్నారు. అక్కడితో అంతా ఓకే అయిపోయింది. కాకపోతే అంతకుముందు కూడా ఎవ్వరూ ఎవ్వరికీ హానీ చేయరు. అందరం ఇండస్ట్రీలో ఉన్నాం. ఒక వ్యక్తి మాత్రం మా అన్నను టార్గెట్ చేసి ప్రతి సారి మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కానీ అన్న పట్టించుకోలేదు. నాన్న గారు పట్టించుకోలేదు. ఎన్నికలు అయ్యాక, రిజల్ట్స్ వచ్చాక.. మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్లను కూడా బూతులు తిట్టాడు. అలా ఎందుకు చేశాడని ఆలోచిస్తుంటే నాన్న ఒకటే అన్నారు. వాళ్లకు లైఫ్ లో హైయర్ పర్పస్ లేదురా. వదిలేయ్ అన్నారు. దీంతో కరెక్టే అనిపించింది. అతడి చుట్టూ గొప్పగొప్ప వాళ్లు ఉన్నారు. అతడి చుట్టూ హైయర్ పర్పస్ ఉన్నవాళ్లు ఉన్నారు. వాళ్ల ఫ్యామిలీలో. కానీ.. ఆయనకు మాత్రం ఏం లేదు. ఆయన ఏం లేకుండా ఉండిపోయారు. మనకి హైయర్ పర్పస్ లేకపోతే.. జీవితం చాలా పేలగా ఉంటుంది.
Manchu Manoj : హైయర్ పర్పస్ అంటే ఏంటి?
హైయర్ పర్పస్ అంటే ఏంటి.. దాని కోసం మీకు ఒక కథ చెబుతాను. మాది రాయలసీమ. రాయలసీమను రత్నాల సీమ అంటారు. కానీ.. ఇక్కడ రత్నాలు అన్నీ రాజులే కొట్టుకెళ్లిపోయారు. మాకున్న ఒకే ఒక రత్నం మా బాలాజీ గారు. వెంకటేశ్వర స్వామి. రాయలసీమ చాలా కష్టం. ఇక్కడ వర్షాలు ఉండవు. పంటలు పండవు. చాలా కష్టపడతారు. ఇక్కడినుంచి గొప్పవాళ్లు రావడం చాలా కష్టం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన భక్తవత్సలనాయుడు.. చెన్నైకి వెళ్లి అక్కడ పీటీ మాస్టర్ గా చదివి ఒక స్కూల్ లోకి వెళ్లి ఉద్యోగం చేస్తుంటే వాళ్ల క్యాస్ట్ కాదని తీసేశారు. దీంతో బయటికి వచ్చి ఒక కార్ షెడ్డులో ఉండి ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు.
ఎందుకంటే అప్పుడే బయటికి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని చెప్పి కష్టాల్లో ఉంటే.. రెంట్ కట్టలేదని తినే పాత్రల్లో టాయిలెట్ పోశాడు ఓనర్. ఇది చాలామందికి తెలియదు. అయినా ఆయన కుంగిపోకుండా ఎన్నో కష్టాలు పడి సినిమాల్లో రాణించారు. నటుడు కావాలనే ఒక గోల్ తో స్టార్ట్ చేశారు. బతుకు తెరువు కోసం స్టార్ట్ చేసి ఉంటారు. అదే టైమ్ లో 500 సినిమాల్లో నటించారు. ఆ గ్యాప్ లోనే రాజకీయ నాయకుడిగా ఎంపీ అయ్యారు. ఇదంతా కాదు. ఏదో మిస్ అవుతుందని.. హైయర్ పర్పస్ ఏంటి అని ఆలోచించుకొని విద్యానికేతన్ ను పెట్టారు. స్కూల్ మొదలు పెట్టి ఇప్పుడు ఇంత దూరం వచ్చారు.. అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్.