Home » Entertainment » Manchu Vishnu Attacked On His Own Brother Manchu Manoj On Video
Entertainment

Manchu Manoj – Manchu Vishnu : మంచు మనోజ్ బంధువుల ఇంటిపై దాడికి పాల్పడిన విష్ణు.. వీడియో రికార్డ్ చేసేసిన మంచు మనోజ్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 24, 2023 1:39 pm
Advertisement

Manchu Manoj – Manchu Vishnu : ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. రాయలసీమ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంకీ చెందిన భూమా కుటుంబానికి చెందిన భూమా మౌనికానీ పెళ్లి చేసుకోవడం జరిగింది. కేవలం కొద్దిమంది బంధువులు స్నేహితులు మధ్య మార్చి మూడవ తారీకు వీరి వివాహం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే గత కొద్ది రోజుల నుండి మంచు ఫ్యామిలీలో గొడవలు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలా ప్రచారం జరుగుతూ ఉండగా మంచు మనోజ్ తన ఫేస్ బుక్ స్టేటస్ లో సంచలన వీడియో పోస్ట్ చేశాడు.

Advertisement

Manchu Vishnu Attacked On His Own Brother Manchu Manoj on video

 

Advertisement

తమ బంధువుల ఇళ్లకు మంచు విష్ణు వచ్చి దాడులకు పాల్పడుతున్నాడని వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియోని స్టేటస్ రూపంలో పెట్టి ఇది సిచువేషన్ అంటూ తన దగ్గర పనిచేస్తున్న సారధి అనే వ్యక్తిని కొట్టడానికి విష్ణు అతని ఇంటికి వెళ్లినట్లు తెలియజేశారు. వీడియో చిత్రీకరణ బట్టి చూస్తే స్వయంగా మంచు విష్ణు దాడి చేయడానికి వస్తున్న క్రమంలో మనోజ్ వీడియో తీసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా విష్ణు మరియు మనోజ్ మధ్య మనస్పర్ధలు

Manchu Vishnu Attacked On His Own Brother Manchu Manoj on video

Advertisement

ఉన్నట్లు వస్తున్నా వార్తలు తాజా వీడియో మరింత బలం చేకూర్చినట్లు అయింది. మంచు మనోజ్ రెండో పెళ్లి అక్క మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది. పెళ్లికి మోహన్ బాబు మరియు విష్ణు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అయితే పెళ్లి జరిగే అంతవరకు విష్ణు పెద్దగా లేడని మధ్యలోనే వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్త రావటం సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు ఏకంగా మనోజ్ దగ్గర పనిచేసే సారధి అనే వ్యక్తిపై కొట్టడానికి మంచు విష్ణు వెళ్లటం ఆ పరిస్థితులను మంచు మనోజ్ చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో వీడియో వైరల్ అవుతుంది. దీంతో మంచు ఫ్యామిలీ వివాదాలు.. రోడ్డున పడినట్లు అయింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి