Manchu Vishnu : “మా” సభ్యత్వం చాలా టైట్ చేసేసాం మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Manchu Vishnu : “మా” సభ్యత్వం చాలా టైట్ చేసేసాం మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు వీడియో వైరల్..!!

Manchu Vishnu : “మా” అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల సంచలన స్పీచ్ ఇచ్చారు. 2021 అక్టోబర్ 11 వ తారీకు “మా” ఎలక్షన్ విజయం సాధించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇక అదే నెల 30వ తారీకు “మా” అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పదవిలోకి వచ్చి ఏడాది పైగా అయిన క్రమంలో ఇచ్చిన హామీలలో 90% అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇంకా అందరూ ఎదురు చూస్తున్నట్టు “మా” భవనం కూడా త్వరలో కంప్లీట్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :16 April 2023,9:00 pm

Manchu Vishnu : “మా” అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల సంచలన స్పీచ్ ఇచ్చారు. 2021 అక్టోబర్ 11 వ తారీకు “మా” ఎలక్షన్ విజయం సాధించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇక అదే నెల 30వ తారీకు “మా” అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పదవిలోకి వచ్చి ఏడాది పైగా అయిన క్రమంలో ఇచ్చిన హామీలలో 90% అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇంకా అందరూ ఎదురు చూస్తున్నట్టు “మా” భవనం కూడా త్వరలో కంప్లీట్ చేయబోతున్నట్లు విష్ణు పేర్కొన్నారు.

Maa President Manchu Vishnu Comments Over RRR Oscar Award Function

Maa President Manchu Vishnu Comments Over RRR Oscar Award Function

ఇంకా గతంలో మాదిరిగా “మా” సభ్యత్వం అందరికీ వచ్చేలా కాకుండా కేవలం నటులకు మాత్రమే ఉండే విధంగా ఈసారి రూల్స్ కట్టుదిట్టం చేసినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇంకా అందరికీ అవకాశం రావాలని మొదటి నుంచి చెబుతున్నాను. ఆ రీతిగానే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయో ఒక బుక్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇదే సమయంలో త్వరలో సంక్రాంతి పండుగ తర్వాత ఒక యాప్ కూడా అందుబాటులోకి రానుంది.

manchu vishnu comments on hyper aadi

manchu vishnu comments on hyper aadi

ఇండస్ట్రీలో వచ్చే కొత్త వారికి ఏ ప్రొడక్షన్ లో అవకాశం ఉంది అనేది అన్ని వివరాలు అందులో సమాచారం ఉంటుంది. ఇండియాలో ఈ విధంగా ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో యాప్ అందుబాటులో లేదు. అతి కష్టమైన సమయంలో సైతం మా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని మంచు విష్ణు స్పష్టం చేశారు. కచ్చితంగా మా అధ్యక్ష భవనం కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని పేర్కొన్నారు

https://youtu.be/u1gdFUJHrEw

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది