Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  కన్నప్ప బాగుందంటూనే విమర్శలు చేసిన తమ్మారెడ్డి భరద్వాజ

  •  కన్నప్ప వల్ల మంచు ఫ్యామిలీ కి పెద్ద బొక్క పడినట్లేనా..?

  •  Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. కానీ, అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్‌ ఎందుకు రాలేదో కూడా మీడియాతో తెలిపారు. ఈ కథకు ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కూడా తమ్మారెడ్డి చెప్పారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే, పదిరోజుల్లో కేవలం రూ. 50 కోట్ల మార్క్‌ను కూడా కన్నప్ప అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా ఉన్న మొహన్‌ బాబుకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ ఉంది.

Tammreddy Bharadwaja కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : కన్నప్ప కోసం విష్ణు బాగానే కష్టపడ్డాడు కానీ ఫలితం లేకుండా పోయింది – తమ్మారెడ్డి

ఇక తమ్మారెడ్డి భరద్వాజ కన్నప్ప గురించి మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా చూశాను. చాలా బాగుంది. కానీ సినిమా తెరకెక్కించే విషయంలో పాన్‌ ఇండియా రేంజ్‌ గురించి మాత్రమే ఆలోచించారు. అయితే భక్తికి తగ్గ రేంజ్‌లో జాగ్రత్తలు తీసుకోలేదు. భక్తి అనే కాన్సప్ట్‌ను ప్రధానంగా తీసుకుని కన్నప్పను నిర్మించింటే బాక్సాఫీస్‌ వద్ద రూ. 1000 కోట్లు రాబట్టే ఛాన్స్‌ ఉండేది. సినిమాలో శివుడు (అక్షయ్‌ కుమార్‌), పార్వతి (కాజల్ అగర్వాల్)ని చూస్తుంటే నాకు ఇరిటేషన్‌ వచ్చింది. వారిద్దరు తప్పా మిగిలిన పాత్రలు అన్నీ బాగున్నాయి.

కన్నప్ప సినిమా చూస్తున్నంత సేపు ‘అన్నమయ్య’ కాన్సప్ట్‌ గుర్తుకు వస్తుంది. ఔట్‌ డేటెడ్‌ కాన్సప్ట్‌ను తీసుకున్నారని అనిపించింది. ఏదేమైనా విష్ణును అభినందించాలి. కన్నప్ప విషయంలో బాగా కష్టపడ్డాడు. కానీ అందుకు తగిన ఫలితం మాత్రం దక్కలేదు. సినిమాపై కొందరు భారీగా ట్రోల్‌ చేశారు. కానీ, బ్యాడ్‌ రిపోర్ట్‌ రాలేదు. సినిమా ఒక్కసారి అయినా చూడాల్సిందే అనే రివ్యూలు వచ్చాయి.’ అని ఆయన అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది