Manjusha : మిల‌మిల మెరిసిపోతున్న మంజూష‌.. అందాల‌తో మ‌త్తెక్కిస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Updated on : 17 March 2022, 10:00 pm

Manjusha : బుల్లితెర‌పై సంద‌డి చేసే యాంక‌ర్స్‌లో మంజూష ఒక‌రు. ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. మంజూష రాంపల్లి మొదట మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి.. తన అందచందాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అలా ఆమె ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. ఆరంభంలోనే పలు అదిరిపోయే షోలను హోస్ట్ చేసింది.

మొదట్లోనే మంజూష బుల్లితెరపై యాంకర్.. ‘రాఖీ’ సినిమాతో నటిగా తన సత్తాను నిరూపించుకుంది. కానీ, కొద్ది రోజులకు ఆమె అటు టీవీల్లోనూ, ఇటు సినిమాల్లోనూ చేయడం మానేసింది.ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన మంజూష దాదాపు 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను చేసి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవ‌లి కాలంలో అటు టీవీలో, ఇటు సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా సోషల్ మీడియా ద్వారా యాంకర్ మంజూష తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది.

manjusha killing looks viral

manjusha killing looks viral

Manjusha : మంజూష ఆర‌బోత మాములుగా లేదుగా..

ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌లో ఈమె పేరు ట్రెండ్ అవుతోంది.తాజాగా మంజూష ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ చేయగా, ఆ ఈవెంట్ కోసం చాలా అందంగా త‌యారైంది. ముద్దులొలికే అందాల‌తో మ‌తులు పోగొట్టేలా ఈ అమ్మ‌డు ర‌చ్చ చేస్తూ మైమ‌రిపించింది. క్యూట్ క్యూట్ అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తూ కేక పెట్టిస్తుంది. ప్ర‌స్తుతం మంజూష స్ట‌న్నింగ్ పిక్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మంజూష క్యూట్ నెస్‌పై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు .తక్కువ టైంలోనే ఆమె ఫొటోస్ వైరల్ అయిపోయింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి