RRR : ఆర్ఆర్ఆర్ టీంకి గుడ్ న్యూస్.. టిక్కెట్ ధర ఎంత పెంచారో తెలుసా?
RRR : మార్చి25న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా, ఈ సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో విడుదల చేశారు. సినిమా రిలీజ్ కానున్న ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ప్రత్యేక ధరలు ఉంటాయని ప్రభుత్వం జీవోలో వివరించింది. టిక్కెట్ ధరలకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీన జీవో జారీ చేసింది.
కార్పోరేషన్లలోని నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.60లుగా, నాన్ ప్రీమియం టికెట్ రూ.40గా నిర్ణయించారు.ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.100, నాన్ ప్రీమియం టికెట్ రూ.70.గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.125, నాన్ ప్రీమియం టికెట్ రూ.100 గా నిర్ణయం తీసుకొన్నారు. మల్టీప్లెక్సులలో రెగ్యులర్ టికెట్ రూ.150, రిక్లయినర్ సీట్ టికెట్ రూ.250 గా నిర్ణయించారు. మున్సిపాలిటీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.50గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.30గా నిర్ణయం తీసుకొన్నారు.ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.80గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.60గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.100, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.80గా మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.125, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250గా నిర్ణయించారు.

Good news for the RRR team ticket price
RRR : గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
నగర పంచాయితీ, గ్రామ పంచాయితీల్లో నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.40, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20, ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.70, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50గా నిర్ణయించారు. స్పెషల్ థియేటర్లులో ప్రీమియం టికెట్ ధర రూ.90, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70, మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.100, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250.గా నిర్ణయించారు.ఈ టికెట్ ధరలకు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. టిక్కెట్ రేట్లపై జీవో జారీ చేయడం కంటే ముందే ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించిన కారణంగా రాష్ట్రంలో 20శాతం షూటింగ్ నిబంధన వర్తించదని మంత్రి పేర్ని నాని తెలిపారు. కొత్తగా నిర్మించే సినిమాలకు నిబంధనలు వర్తిస్తాయన్నారు.