Allu arjun : అల్లు అర్జున్‌తో సినిమా అంటే దేశ వ్యాప్తంగా అభిమానుల్లో ఉండే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు. ఐకాన్ స్టార్‌తో ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా పాన్ ఇండియన్ స్థాయిలో ఉండే కథనే సిద్దం చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్‌ను ఊరమాస్ హీరోగా చూపించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరోసారి సినిమా చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవూ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పుష్ప రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయిదు భాషలలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇటీవల రిలీజైన పుష్ప టీజర్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉండబోతోందట. ఇప్పటికే అల్లు అర్జున్‌కు దర్శకుడు కథ కూడా వినిపించినట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ భారీగా అడ్వాన్స్ కూడా ఇచ్చారట. బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక అల్లు అర్జున్ సినిమా పనులు మొదలు పెట్టబోతున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుందని సమాచారం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.