Mahesh babu : మే 31న మహేష్‌తో ఆ స్టార్ డైరెక్టర్ సినిమా అనౌన్స్..!

Authored By vamana sai | The Telugu News | Published on: April 16, 2021, 2:10 pm

Mahesh babu : మహేష్ బాబు కొత్త సినిమా ప్రకటన రాబోతుందా.. అందుకు దర్శకుడు.. ప్రకటన తేదీ కూడా ఖరారయ్యాయా.. ఒక స్పెషల్ డేకి.. ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతుందా…ఎస్..అవును.. అనే మాటే ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు నటిస్తున్న 27న సినిమా సర్కారు వారి పాట సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ఇప్పటికే దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం రెండవ షెడ్యూల్‌ని హైదరబాద్‌లో జరుపుతున్నారు.

may 31 star director is going to announce a movie with  mahesh-babu

may 31 star director is going to announce a movie with mahesh-babu

యూనివర్సల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు పరశురాం ఈ సినిమాని హాలీవుడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ మొదలయ్యేసరికి ఇంకా ఎన్ని నెలల సమయం పడుతుందో కరెక్ట్‌గా తెలియడం లేదు.

Mahesh babu : మే 31న మహేష్ – త్రివిక్రంల కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్..!

అందుకే మహేష్ నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అయ్యాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌కి సైన్ కూడా చేశాడట. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న మహేష్ – త్రివిక్రంల కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని అనుకుంటున్నట్టు సమాచారం.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp