Meenakshi Chaudhary : మైండ్ బ్లోయింగ్ లుక్స్‌తో మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి.. పిక్స్ వైరల్..!
ప్రధానాంశాలు:
Meenakshi Chaudhary : మైండ్ బ్లోయింగ్ లుక్స్‌తో మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి.. పిక్స్ వైరల్..!
Meenakshi Chaudhary : టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదు ఉన్న అందాల హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ సైలెంట్ గా ఉంటుంది. కొన్ని నెలలుగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి.

Meenakshi Chaudhary : మైండ్ బ్లోయింగ్ లుక్స్‌తో మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి.. పిక్స్ వైరల్..!
Meenakshi Chaudhary : క్రేజీ లుక్స్..
2017లో మిస్ ఐఎమ్ఏ పోటీల్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగులోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ వయ్యారి. ఆ తర్వాత కొన్నాళ్లకు రవితేజ సరసన ఖిలాడీ మూవీతో మరోసారి తెలుగు సినీప్రియులను అలరించింది. కొన్నాళ్లు ఆడపాదడపా చిత్రాల్లో కనిపించిన ఈ వయ్యారి.. హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ వచ్చాయి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ జోడిగా లక్కీ భాస్కర్ చిత్రంలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న ఈ భామ సోషల్ మీడియాలోను రచ్చ చేస్తుంది. కేక పెట్టించే లుక్స్‌తో సెగలు రేపుతుంది మీనాక్షి.