Meera Jasmine : సోయ‌గాల‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న మీరా జాస్మిన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Meera Jasmine : సోయ‌గాల‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న మీరా జాస్మిన్

Meera Jasmine : మీరా జాస్మిన్.. ఈ అమ్మ‌డు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కేరళ కుట్టీ అయిన మీరా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. సహజమైన నటనతో ఆకట్టుకున్న ఆమె ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలనే చేసింది. తెలుగులో మీరా నటించిన మొదటి సినిమా అమ్మాయి బాగుంది. శివాజీ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమయ్యారు. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :9 August 2022,6:20 pm

Meera Jasmine : మీరా జాస్మిన్.. ఈ అమ్మ‌డు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కేరళ కుట్టీ అయిన మీరా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. సహజమైన నటనతో ఆకట్టుకున్న ఆమె ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలనే చేసింది. తెలుగులో మీరా నటించిన మొదటి సినిమా అమ్మాయి బాగుంది. శివాజీ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమయ్యారు. ఈ క్రమంలో మీరా జాస్మిన్ తనలోని గ్లామర్ కోణం చూపిస్తుంది. దర్శక నిర్మాతలకు ఇంకా హీరోయిన్ పాత్రలను చేయగలను అన్నట్లు సందేశం పంపుతుంది. మళ్ళీ ఆమెకు హీరోయిన్ వేషాలు రావడం జరగని పనే.

Meera Jasmine : రెచ్చిపోతున్న మీరా..

కొంత కాలంగా మీరా జాస్మిన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ లేపుతుంది. ఎద అందాల‌తో పాటు థైస్ షోతో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మీరా జాస్మిన్ క్యూట్ లుక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. మీరాని ఇలా చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం మీరా బ్యూటీ లుక్స్ నెట్టింట హల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఫార్మ్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ వంటి స్టార్స్ తో జతకట్టింది. 2013లో విడుదలైన మోక్ష ఆమెకు తెలుగులో చివరి చిత్రం. 2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్.

Meera Jasmine Beautiful Photos In Instagram

Meera Jasmine Beautiful Photos In Instagram

మీరా జాస్మిన్ కొన్నేళ్ల పాటు వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి సినిమాలో అమాయకమైన పాత్రల్లో నటించి మెప్పించిన మీరా జాస్మిన్ ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చేసింది. గుడుంబా శంకర్, రారాజు, మహారధి లాంటి చిత్రాలలో నటించింది. అయితే, కమర్షియల్ హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి ఆసక్తి చూపించలేదు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది