Meera Jasmine : పెళ్లయి తల్లయినా అందం తగ్గలేదు.. మీరా జాస్మిన్ ఏంటి.. ఇంతలా రెచ్చిపోయింది… వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 3 December 2022, 1:00 pm

Meera Jasmine : మీరా జాస్మిన్ తెలుసు కదా. తను ఇప్పటి హీరోయిన్ కాదు. టాలీవుడ్ లో చాలా సీనియర్. తనది కేరళ. తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది మీరా జాస్మిన్. తను డిగ్రీ చదువుతున్న సమయంలోనే మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మీరా జాస్మిన్. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ నటించింది. వందల సినిమాల్లో నటించి తనేంటో నిరూపించుకుంది. తన నటనకు గాను చాలా అవార్డులు కూడా వచ్చాయి.

మీరా జాస్మిన్ అంటేనే మనకు గుర్తొచ్చేది భద్ర సినిమా. ఆ సినిమాతో తన రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కొన్నేళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది మీరా జాస్మిన్. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ అస్సలే తగ్గలేదు. 2016 లో తన కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టింది మీరా జాస్మిన్. 2014 లోనే మీరా జాస్మిన్ కు పెళ్లయింది. జాన్ టెటస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అబ్రాడ్ లో స్థిరపడింది మీరా.

Meera Jasmine latest photos viral

Meera Jasmine latest photos viral

Meera Jasmine : మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్

కానీ.. కొన్ని కారణాల వల్ల తను అతడితో విడిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లు తన పర్సనల్ లైఫ్ కు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు మళ్లీ తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించింది. ప్రస్తుతం మలయాళంలోనే ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగు, తమిళంలో కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి అందులో తన గ్లామర్ ను ప్రదర్శిస్తోంది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి